Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి...

Gold
Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల భారీగా పెరుగుతున్నాయి. తద్వారా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలుకు ఆర్థికబలం ఉన్నవారుసైతం వెనుకడుగు వేస్తున్నారు. అయితే, పసిడి ప్రియులకు ఊరట నిచ్చేలా ఇవాళ బంగారం రేటు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర 2,986 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అయితే, శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 110 తగ్గింది. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.అయితే, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,670 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,820.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.89,670 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,12,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000గా నమోదైంది.