Gold Rate Today: గోల్డ్ ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..

Gold
Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏదైనా బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. ప్రస్తుతం గోల్డ్ రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారం కొనుగోలు మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తద్వారా గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అయితే, ఇవాళ బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. గోల్డ్ రేటు పెరగలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10గ్రాముల) ధర శనివారం ఉదయం 3,315 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ్టి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక భారతదేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,580 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,730.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,580 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద కొనసాగుతుంది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.