Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు ఊరట .. తులం గోల్డ్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం ..

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు ఊరట .. తులం గోల్డ్ ధర ఎంతంటే?

Gold

Updated On : March 17, 2024 / 10:57 AM IST

Gold And Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. గతవారం ఆకాశమే హద్దుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర.. ఈ వారం కాస్త శాంతించింది. అయితే, శనివారం మరోసారి ధర పెరగ్గా.. ఆదివారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను జూన్ సమీక్షలో తగ్గిస్తుందన్న సంకేతాల నడుమ బంగారం రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండిధరసైతం స్థిరంగా కొనసాగుతుంది.

Gold Price Today

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,590 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,100 మార్క్ కు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,740 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 66,250.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,590 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,100.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,150 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.66,710 వద్ద కొనసాగుతుంది.

Gold

స్థిరంగా వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండిధర స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాలను ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,300 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,200 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,300 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.76,100 వద్ద కొనసాగుతుంది.