Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండోరోజు బంగారం ధర పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold
Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతుంది. పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండోరోజు బంగారం ధర పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,600 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,750కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,900 కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,000 కాగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,180 కు చేరింది.
తగ్గిన వెండి ధర..
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 700 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,100 వద్దకు చేరింది.
బెంగళూరులో మాత్రం కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.74,000 కు చేరింది.