Gold Prices : బాబోయ్.. 10 గ్రాముల బంగారం ధర రూ.90వేలు..? 2025లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం..!

జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ కానుండటంతో 2025లోనూ గోల్డ్ కు రెక్కలు రావొచ్చని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Gold Prices : బాబోయ్.. 10 గ్రాముల బంగారం ధర రూ.90వేలు..? 2025లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం..!

Updated On : January 2, 2025 / 1:39 AM IST

Gold Prices : 2024… ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఇయర్. 1979 తర్వాత 2024లో గోల్డ్ రేట్ ఒక ఏడాదిలో అత్యధిక వార్షిక లాభాన్ని అందించింది. మరి ఇదే జోరు 2025లోనూ కంటిన్యూ అవుతుందా అంతా.. అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు. కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్ 90వేల రూపాయలకు చేరుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ కానుండటంతో ఇన్వెస్టర్లంతా సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు మార్కెట్ నిపుణులు.

జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ కానుండటంతో 2025లోనూ గోల్డ్ కు రెక్కలు రావొచ్చని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగడంతో పాటు ఆర్థిక అనిశ్చితి కంటిన్యూ అయితే దేశీయ మార్కెట్ లో పుత్తడి ధర రూ.90వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా గోల్డ్ కు జై కొడుతుండటమే దీనికి కారణం అని వారు అభిప్రాయపడుతున్నారు.

Also Read : భారత్ లో బంగారం ఎక్కువ వాడేది ఎవరు? పసిడిని ఎంత వరకు దాచుకోవచ్చు?

పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ రిజర్వ్ లను పెంచుకోవడంపై దృష్టి పెడుతుండటం, వచ్చే కేంద్ర బడ్జెట్ లో గోల్డ్ సుంకాల సవరణలపై ఊహాగానాలు రావడం, జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపడుతుండటం, ట్రంప్ అధికారంలోకి రాగానే ట్రేడ్ వార్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండటంతో పాట పల అంశాలు 2025లో గోల్డ్ రేట్లపై ప్రభావం చూపనున్నాయి.

* 2024లో గోల్డ్ రేట్ 23 శాతం పెరిగింది
* 2024 అక్టోబర్ 30న ఎల్లో మెటల్ రికార్డ్ స్థాయిలో 82వేల 400 రూపాయలకు ఎగబాకింది
* ఇక వెండి సైతం 2024లో 30శాతం రిటర్న్స్ అందించింది
* ఒక దశలో లక్ష మార్క్ ను కూడా క్రాస్ చేసిన వెండి
* 2024 ప్రారంభంలో ఔన్స్ గోల్డ్ ధర 2,062 డాలర్లు
* అక్టోబర్ 31న రికార్డ్ స్థాయిలో 2,800 డాలర్ల సమీపానికి ఔన్స్ గోల్డ్
* యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల సవరణపై ఆచితూచి వ్యవహరిస్తుండటంతో గోల్డ్ రేట్ 2025లో 90వేలకు చేరుకోవచ్చని, కేజీ వెండి లక్ష 25వేల రూపాయలకు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.