Gold Rate: గత వారం బంగారం ధర ఎంతగా తగ్గిందో తెలుసా?

సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Gold Rate: గత వారం బంగారం ధర ఎంతగా తగ్గిందో తెలుసా?

Gold Rate

బంగారం ధరలో గత వారం 1.4 శాతం తగ్గుదల కనపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ అధికారులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు యూఎస్ డాలర్‌ ఇండెక్స్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు కారణం. గత వారం ముగింపు సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.62,303గా ఉంది.

అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కి 2,024 డాలర్లుగా ఉంది. అయితే, ధరల్లో చోటుచేసుకున్న స్వల్ప తగ్గుదలతో పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మధ్యప్రాచ్యంలో భౌగోళికంగా నెలకొన్న ఉద్రిక్తతలు, గత ఏడాది ద్రవ్యోల్బణానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం వేసిన అంచనాలను సవరిస్తుండడంతో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

సాధారణంగా దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అలాగే, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి వల్ల ధరలు పెరుగుతాయి. వీటితో పాటు రాజకీయ ఉద్రిక్తతలూ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతాయి. పసిడి ధరలు 2024లో పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే విశ్లేషకులు చెప్పారు. గత ఏడాది పసిడి ధర 13 శాతం మేర పెరిగింది.

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతంటే..