తగ్గిన బంగారం ధర

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 12:46 PM IST
తగ్గిన బంగారం ధర

వరుసగా 4వ రోజూ బంగారం ధర తగ్గింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.32,620గా నమోదైంది. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటం.. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర నడిచింది. కేజీ వెండి ధర రూ.80 తగ్గుదలతో రూ.38,100గా నమోదైంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం క్షీణతతో 1,289.75 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.51 శాతం తగ్గుదలతో 14.88 డాలర్లకు క్షీణించింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.32,620కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.32,450కు క్షీణించింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,670కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,160కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.40,100కు క్షీణించింది. అంతర్జాతీయ మందగమన ఆందోళనలు తగ్గముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్ లో పసిడి ధర సోమవారం(ఏప్రిల్ 15) వారం రోజుల కనిష్టానికి పతనమైంది. ఆసియా మార్కెట్ లో సోమవారం 3.25డాలర్లు క్షీణించి 1,291.95 వద్ద ట్రేడ్‌ అయ్యింది. చైనా ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి నమోదు కావడం, అమెరికా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ నిపుణులు చెప్పారు. చైనా ఎగుమతి గణాంకాలు మార్చిలో 5నెలల గరిష్టస్థాయికి చేరుకున్నాయి.