Gold Price: బంగారం కొంటున్నారా? పసిడి ధరలు భారీగా ఎందుకు పెరుగుతున్నాయి? నిపుణులు ఏమంటున్నారు?
అవి రికార్డు స్థాయికి చేరుకుంటాయని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయంగా బలమైన డిమాండ్, ఆర్థిక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనిపై సీనియర్ అనలిస్ట్ క్రిస్టోఫర్ లూయిస్ పలు వివరాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు తరచుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని అన్నారు.
ప్రస్తుతం, ఈ కారణాలు బంగారం ధరలను పైపైకి తీసుకెళ్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులు సమీప భవిష్యత్తులోనూ కొనసాగవచ్చని అన్నారు. ఈ ధోరణి కొనసాగుతుందని వ్యాపారులు భావిస్తుండడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
మార్కెట్ సుంకాలు (దిగుమతులు, ఎగుమతులపై పన్నులు), ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి వాటిపై వ్యాపారులు దృష్టి సారించారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అనిశ్చితంగా ఉన్నప్పుడు ప్రజలు బంగారంలో పెట్టుబడులను సురక్షితమైన ఆప్షన్‌గా చూస్తారని అన్నారు.
Also Read: ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. ఓపెనర్‌గా ఎవరు దిగుతారో చెప్పేసిన పాక్ కెప్టెన్
ట్రేడర్స్ న్యూయార్క్‌లో తిరిగి పెట్టుబడులు పెట్టడంతో మంగళవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయని అన్నారు. ఇది మార్కెట్లో బలమైన డిమాండ్ ఉన్న ధోరణిని చూపుతోందని చెప్పారు.
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని, అవి రికార్డు స్థాయికి చేరుకుంటాయని తాము భావిస్తున్నట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ ట్రెండ్ మారుతుందా? అన్న విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది మారదని స్పష్టం చేశారు.
ఒకవేళ బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గితే, అవి మళ్లీ పెరగకముందే కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఓవరాల్ ట్రెండ్ ఇప్పటికీ బలంగా ఉందని, ఎందుకంటే ద్రవ్యోల్బణం, వాణిజ్య సుంకాలు గురించి ప్రజలు ఆందోళన చెందుతుండడంతో బంగారం ధరలు పెరుగుతూనే ఉండే అవకాశాలు కనపడున్నాయని వివరించారు.
స్వల్పకాలికంగా బంగారం ధరలు తగ్గితే అది పసిడి కొనుక్కోవడానికి మంచి అవకాశమని, ప్రత్యేకించి ధరలు ఔన్సుకి 2,800 కంటే తక్కువగా ఉంటే వెంటనే కొనుక్కోవచ్చని చెప్పారు. బంగారం ఔన్సుకి 3,000 డాలర్లు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.