Gold Prices: గోల్డ్ రన్.. భారీగా పెరగనున్న బంగారం ధరలు.. త్వరలోనే లక్షన్నర..!

గోల్డ్ పై ఇంతగా రిటర్న్స్ వచ్చింది లేదు. ఒకే ఏడాదిలో 40శాతం, 50శాతం రిటర్న్స్ మేము ఎప్పుడూ చూడలేదు.

Gold Prices: గోల్డ్ రన్.. భారీగా పెరగనున్న బంగారం ధరలు.. త్వరలోనే లక్షన్నర..!

Updated On : October 8, 2025 / 8:59 PM IST

Gold Prices: బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో గోల్డ్ రన్ ఉంటోంది. ఇదిలా ఉంటే పసిడి ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. త్వరలోనే పుత్తడి ధర లక్షన్నర కావొచ్చని అంచనా వేశారు.

బంగారం ధర రోజురోజుకి దూసుకుపోతోంది. ఇకపై ఇన్వెస్ట్ మెంట్ పసిడిపైనే పెట్టాలా అన్న ఆలోచన కూడా జనాల్లో మొదలైపోయింది. గోల్డ్ ను నమ్ముకుంటే లైఫ్ గోల్డేనా? అసలిప్పుడు పుత్తడి కొనొచ్చా? వ్యాపారులు, అనలిస్టుల అంచనాలపై 10టీవీ స్పెషల్ డిబేట్ లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. త్వరలోనే గోల్డ్ ధర లక్షన్నర కావడం ఖాయమని ప్రముఖ సెర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవీ రెడ్డి.

‘ఒక బ్యాంకులో ఒక లక్ష రూపాయలు ఎఫ్ డీ చేసినట్లు అయితే వన్ ఇయర్ తర్వాత అది లక్ష 7వేలు అవుతుంది. అలానే స్టాక్స్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత లక్ష వెయ్యి రూపాయలు రిటర్న్స్ వచ్చాయి. అదే గోల్డ్ లో లక్ష రూపాయలు పెట్టినట్లు అయితే.. వన్ ఇయర్ తర్వాత లక్ష 56 వేలు రిటర్న్స్ వచ్చాయి. సిల్వర్ విషయానికి వస్తే లక్ష రూపాయలు పెట్టి ఉంటే వన్ ఇయర్ తర్వాత లక్ష 61 వేలు అయ్యింది. ర్యాలీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లాస్ట్ రెండు మూడేళ్ల నుంచి చూస్తున్నాం. గోల్డ్ పై ఇంతగా రిటర్న్స్ వచ్చింది లేదు. ఒకే ఏడాదిలో 40శాతం, 50శాతం రిటర్న్స్ మేము ఎప్పుడూ చూడలేదు. లాస్ట్ టు ఇయర్స్ నుంచి అసెట్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఏదైనా ఎక్కువగా ఉందంటే అది గోల్డే.

టెన్ గ్రామ్స్ గోల్డ్ 70వేలుగా ఉన్నప్పుడు.. లక్ష రూపాయలు కచ్చితంగా అవుతుందని చెప్పాము. ఇప్పుడు అది లక్ష 30వేలు ఉంది. త్వరలోనే లక్ష 50వేలు అవుతుందని చెప్పొచ్చు. పరిస్థితులు అలా ఉన్నాయి. సిల్వర్ కచ్చితంగా 2లక్షలు అవుతుంది. ఎంత టైమ్ పడుతుంది అనేది కచ్చితంగా చెప్పలేము. కానీ కచ్చితంగా సిల్వర్ 2లక్షలు, గోల్డ్ లక్షన్నర అవుతుంది’ అని మాధవీ రెడ్డి తెలిపారు.

Also Read: వారెవ్వా.. కలెక్టర్‌కి అదిరిపోయే ఫేర్‌వెల్.. పల్లకిలో కూర్చోబెట్టి, భుజాలపై మోస్తూ ఊరేగింపు.. వీడియో వైరల్