IAS Sanskriti Jain: వారెవ్వా.. కలెక్టర్‌కి అదిరిపోయే ఫేర్‌వెల్.. పల్లకిలో కూర్చోబెట్టి, భుజాలపై మోస్తూ ఊరేగింపు.. వీడియో వైరల్
కలెక్టర్ గా సంస్కృతి జైన్ అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు స్థానికులు, సహచర సిబ్బంది.

IAS Sanskriti Jain: ఓ ఐఏఎస్ అధికారిణికి ఎవరూ ఊహించని రీతిలో అపూర్వమైన వీడ్కోలు పలికారు సహచరులు, సిబ్బంది, స్థానికులు. ఆ కలెక్టర్ ను పల్లకిపై కూర్చోబెట్టి భుజాలపై మోస్తూ మరీ ఊరేగించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమ జిల్లాకు వచ్చి అద్భుతమైన సేవలు అందించిన కలెక్టరమ్మ.. వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో ఆమెకు ఎవరూ ఊహించని రీతిలో వీడ్కోలు ఇచ్చారు. ఓ పల్లకీలో కూర్చోబెట్టి స్వయంగా తమ భుజాలపై మోసుకుంటూ వెళ్లడం హైలెట్.
ఆమె పేరు సంస్కృతి జైన్. ఐఏఎస్ ఆఫీసర్. ఏడాది పాటు సీయోనీ కలెక్టర్‌గా సేవలు అందించారు. ఇటీవలే బదిలీ అయ్యారు. ఆమెను భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు.
కలెక్టర్ గా సంస్కృతి జైన్ అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు స్థానికులు, సహచర సిబ్బంది. ఆమె మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ఎవరూ ఊహించని రీతిలో వీడ్కోలు పలికారు. గోల్డ్ కలర్ లో ఉన్న పల్లకిలో కూర్చోబెట్టి స్వయంగా తమ భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు.
2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి సంస్కృతి జైన్.. ఏడాది పాటు సీయోనీ కలెక్టర్‌గా సేవలందించారు. కలెక్టర్ గా పని చేసింది తక్కువ కాలమే అయినా.. పరిపాలనలో, ప్రజల హృదయాల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. ప్రజలకు మంచి సేవలు అందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వారు. వారి సమస్యలు వినడమే కాదు పరిష్కారాలు కూడా చూపించారు. అలా ప్రజల హృదయాలు గెలుచుకున్నారు.
ఇక సహచరులు, సిబ్బందికి సైతం అభిమాన అధికారిణిగా మారారు. ప్రజా సంక్షేమంపై చూపిన ప్రత్యేక శ్రద్ధ.. సంస్కృతి జైన్ కి విపరీతమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అలాంటి ఆఫీసర్ బదిలీ కావడంతో.. ఉద్యోగులు, స్థానికులు ఆమెకు ఇలా వినూత్న రీతిలో వీడ్కోలు పలికి ఆమెపై తమకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. పల్లకిలో కలెక్టర్ తో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్.. LAMP ఫెలోషిప్..
సంస్కృతి జైన్ 1989 ఫిబ్రవరి 14న శ్రీనగర్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేశారు. తండ్రి ఫైటర్ పైలట్‌గా, తల్లి వైద్య విభాగంలో సేవలు అందించారు. బిట్స్ పిలానీ (గోవా క్యాంపస్)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంస్కృతి జైన్.. ప్రతిష్టాత్మక LAMP ఫెలోషిప్‌ను అభ్యసించారు. ఆ తర్వాత పీహెచ్‌డీ చేయాలని అనుకున్నారు. అయితే ఫ్రెండ్స్ సలహాతో సరదాగా యూపీఎస్సీ పరీక్ష రాశారు. ఆశ్చర్యకరంగా మొదటి ప్రయత్నంలోనే ఆమె పరీక్షలో విజయం సాధించారు. రెండో ప్రయత్నంలోనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)లో స్థానం పొందారు. ఇక మూడో సారి కూడా ప్రయత్నించగా.. అఖిల భారత స్థాయిలో 11వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు. 2015 బ్యాచ్ ఆఫీసర్‌గా ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు.
Also Read: భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే.. మేము ఇలా చేస్తాం: పాకిస్థాన్ రక్షణ మంత్రి
पालकी में सवार होकर चलीं कलेक्टर साहिबा: ये हैं सिवनी कलेक्टर संस्कृति जैन. जिनको भोपाल नगर का कमिश्नर बनाया गया है. जिनकी सिवनी से विदाई पालकी में बैठाकर अनोखे अंदाज में की गई…! pic.twitter.com/fSMmIorN7Y
— Rupesh Mishra (@rupeshmishramp) October 5, 2025