Gold Rates: ఆషాఢం రాక.. తగ్గిన బంగారం ధరలు..

వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి.

Gold Rates: ఆషాఢం రాక.. తగ్గిన బంగారం ధరలు..

Gold Rates

Updated On : July 10, 2021 / 7:52 AM IST

Gold Rates(10 July 2021): దేవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అవ్వడంతో ఆషాఢం సేల్‌లను ప్రకటిస్తున్నారు వ్యాపారస్తులు, దేశ రాజధాని ఢిల్లీలో లేటెస్ట్‌గా బంగారం ధరలు రూ.451 తగ్గి 46వేల 844కు చేరకుంది. క్రితం ట్రేడింగ్‌లో దీని ధర రూ.47,295గా ఉంది.

దేశ రాజధానిలో వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీలో వెండి రూ.900కు పైగా తగ్గడంతో నేడు కేజీ వెండి రూ.67వేల 465కు దిగొచ్చింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర 1800 డాలర్లు క్రాస్ చేసి 1815 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూలత పరిస్థితులే విలువైన లోహాల ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.

హైదరాబాద్ నగరంలో..
బంగారం ధరలు హైదరాబాద్ నగరంలో కూడా తగ్గే ఉన్నాయి. ఇవాళ((10 July 2021) 22క్యారెట్ల బంగారం ధర 44వేల 750 రూపాయలుగా ఉండగా.. అదే సమయంలో 24క్యారెట్స్ బంగారం ధర 48వేల 820రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..
విజయవాడ, విశాఖపట్నం నగారాల్లో కూడా బంగారం ధరల్లో మార్పు లేదు.. 22క్యారెట్ల బంగారం ధర 44వేల 750 రూపాయలు కాగా 24క్యారెట్స్ బంగారం ధర 48వేల 820రూపాయలు.