Gold Rates: తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

Gold Price Today
Gold & Silver Rates: బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత సోమవారం రూ.48వేల మార్కు పైన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్ ధరలు వారం ముగిసేసరికి రూ.600 వరకు క్షీణించి 47వేల 500రూపాయల దిగువకు పడిపోయింది.
ఈరోజు(10 జనవరి 2022) కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి ధరతో పోలిస్తే 11రూపాయలు తగ్గింది. పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 44వేల 610గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,660గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 44వేల 610కి చేరుకుంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610గాఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,930కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49వేల 10రూపాయలుగా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 46వేల 610కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,610గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,010గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,560గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.64,600గా ఉంది.