Google Employee : 19 ఏళ్లు న‌మ్మ‌కంగా ప‌ని చేస్తే.. ఉద్యోగం నుంచి తొల‌గించిన గూగుల్‌.. అత‌డేమ‌న్నాడంటే.?

ఇటీవ‌ల కాలంలో ఉద్యోగాల‌కు గ్యారెంటీ లేకుండా పోతుంది.

Google Employee : 19 ఏళ్లు న‌మ్మ‌కంగా ప‌ని చేస్తే.. ఉద్యోగం నుంచి తొల‌గించిన గూగుల్‌.. అత‌డేమ‌న్నాడంటే.?

Google Employee Fired After 19 Years At Company

Updated On : January 13, 2024 / 4:14 PM IST

Google Employee Fired : ఇటీవ‌ల కాలంలో ఉద్యోగాల‌కు గ్యారెంటీ లేకుండా పోతుంది. ఆర్థిక మాంద్యం భ‌యాల మ‌ధ్య ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు చిన్న చిన్న కంపెనీలే కాదు దిగ్గ‌జ కంపెనీలు సైతం ఉద్యోగుల‌ను ఉద్యోగాల‌ నుంచి తొల‌గించేస్తున్నాయి. ఇక టెక్ దిగ్గ‌జం గూగుల్ సైతం వంద‌ల సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు కొత్త ఏడాది ప్రారంభంలోనే షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఉద్యోగాలు కోల్పోనున్న వారిలో డిజిటల్ వాయిస్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప‌ని చేసే వారు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ప్రెష‌ర్స్ ను మాత్ర‌మే కాదు చాలా ఏళ్లుగా సంస్థ‌లో న‌మ్మ‌కంగా ప‌ని చేస్తున్న వారిని సైతం ఉద్యోగాల నుంచి తొల‌గించేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 19 సంవ‌త్స‌రాలు ప‌ని చేసిన ఓ వ్య‌క్తిని తొల‌గించ‌గా అత‌డు సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

అత‌డి పేరు కెవిన్ బౌర్రిలియన్. గూగుల్‌లో 19 సంవ‌త్స‌రాలుగా ప‌ని చేస్తున్నాడు. బుధ‌వారం ఉద‌యం మెయిల్ చెక్ చేసుకునే స‌రికి తాను లే ఆఫ్స్‌కు గురైన‌ట్లు అత‌డికి తెలిసింది. తొలుత ఈ విష‌యాన్ని అత‌డు జీర్ణించుకోలేక‌పోయాడు. ఉద్యోగం పోయినందుకు త‌న‌కు ఏమీ బాధ‌లేద‌ని అత‌డు అన్నాడు. ఇక నుంచి హాయిగా విశ్రాంతి తీసుకోవ‌చ్చున‌ని, కుటుంబంతో మ‌రింత ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పొచ్చున‌ని చెప్పుకొచ్చాడు.

Amazon Republic Day Sale : అమెజాన్ సేల్.. రూ. 30వే లోపు టాప్ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్.. డోంట్ మిస్!
ఓ శ‌కం ముగిసింది. 19 ఏళ్లుగా గూగుల్‌లో ప‌ని చేశాను. లేఆఫ్స్ బాధ క‌లిగించింది. మ‌రేం ప‌ర్వాలేదు. చాలా కాలంగా జీవితంలో మార్పు కోసం చూస్తున్నాను. వేరే ఏం చేయాలి అనే దానిపై ప్ర‌స్తుతానికి ఇంకా ఏం ఆలోచించ‌లేదు. నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. సైక్లింగ్ చేయ‌డం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, ట్రావెలింగ్ చేయ‌డం, కుటుంబంతో గ‌డప‌డం వంటివి ఇంకా మ‌రెన్నో అంటూ కెవిన్ బౌర్రిలియన్ చెప్పుకొచ్చాడు.