Google Pixel 8a Leak : గూగుల్ పిక్సెల్ 8ఎ రెండర్లు మళ్లీ లీక్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లలో వస్తోంది!

వచ్చే మే 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. గత లీక్‌ల ప్రకారం.. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Google Pixel 8a Leak : గూగుల్ పిక్సెల్ 8ఎ రెండర్లు మళ్లీ లీక్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లలో వస్తోంది!

Google Pixel 8a Leaks in New Renders, Shows Off Four Colour Options

Updated On : April 18, 2024 / 9:47 PM IST

Google Pixel 8a Leak : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి ఫస్ట్ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్ వచ్చేస్తోంది. రాబోయే పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్‌లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్ ఆవిష్కరించనుంది. వార్షిక డెవలపర్ ఈవెంట్‌కు కేవలం ఒక నెల ముందుగానే మరిన్ని పిక్సెల్ 8a రెండర్‌లు మరోసారి లీక్ అయ్యాయి. ఈ కొత్త రెండర్‌లు హ్యాండ్‌సెట్‌ను మల్టీ యాంగిల్స్ నుంచి 4 కలర్ ఆప్షన్లలో రానుంది. రెండర్‌ల ప్రకారం.. పిక్సెల్ 8a గత ఏడాది పిక్సెల్ 8 సిరీస్ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుంది.

Read Also : World’s Best Airports : ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలివే.. అగ్రస్థానంలో హమ‌ద్, సింగపూర్‌ చాంగికి రెండో స్థానం!

పిక్సెల్ 8ఎ ఫీచర్లు లీక్ (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. రాబోయే పిక్సెల్ 8ఎ ఫొటోలను మల్టీ యాంగిల్స్ నుంచి ఎంచుకోవచ్చు. ఈ ఫొటోలు హ్యాండ్‌సెట్ ఎలాంటి స్పెసిఫికేషన్‌లను రివీల్ చేయలేదు. అయినప్పటికీ, గత లీకైన ఫొటోల కన్నా మెరుగైన క్వాలిటీతో డిజైన్‌ను కలిగి ఉంది. రెండర్‌లు హోల్-పంచ్ డిస్‌ప్లే, బెజెల్స్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో ఫోన్ డిజైన్‌ను ధృవీకరిస్తాయి.

రెండర్‌లు పిక్సెల్ 8ఎ ఫోన్ బ్లాక్, లైట్ బ్రౌన్ కలర్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లను సూచిస్తున్నాయి. ఈ కలర్ ఆప్షన్లలో పింగాణీ (లేత గోధుమరంగు), బే (నీలం), పుదీనా (ఆకుపచ్చ), అబ్సిడియన్ (నలుపు) ఉండే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో డిజైన్‌తో రానున్నట్టు కనిపిస్తోంది.

వచ్చే మే 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. గత లీక్‌ల ప్రకారం.. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో పాటు గూగుల్ టెన్సర్ జీ3 ఎస్ఓసీ‌తో రన్ అవుతుంది. 27డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో బ్యాకప్ అందిస్తుంది.

ఈ ఫోన్ కొలత 152.1 x 72.6 x 8.9మిమీ ఉంటుంది. పిక్సెల్ 8ఎ ఫోన్ 128జీబీ స్టోరేజీతో బేస్ వేరియంట్ ధర యూకేలో ఈయూఆర్ 570 (దాదాపు రూ. 51వేలు) ధర ట్యాగ్‌తో వస్తుంది. 256జీబీ స్టోరేజీ వెర్షన్ ధర ఈయూఆర్ 630 (దాదాపు రూ. 56వేలు) ఉంటుంది.

Read Also : Air India Express : ఫస్ట్ టైమ్ ఓటు వేసే యువ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ అదిరే ఆఫర్.. విమాన టికెట్లపై 19శాతం తగ్గింపు!