గూగుల్ నుంచి కొత్త ఫీచర్ వస్తోంది

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గెయింట్ గూగుల్ నుంచి కొత్త ఫీచర్ రాబోతోంది. గూగుల్ ఫోన్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లో ఈ సరికొత్త ఫీచర్ కోడ్ రానున్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. అదే.. కాల్ రికార్డింగ్ ఫీచర్. ఈ కోడ్ ఫీచర్ ద్వారా కాల్ రికార్డింగ్ చేసుకోవడమే కాకుండా కాల్ ట్రాన్స్ క్రిప్షన్ కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది.
గూగుల్ రిలీజ్ చేసిన పిక్సల్ 4 ఫోన్లలోని రికార్డర్ యాప్ మాదిరిగా ఉంటుందని పేర్కొంది. ఫిక్సల్ 4 ఫోన్లపై కాల్ రికార్డింగ్ ఫీచర్ పాక్షికంగా పనిచేసేలా XDA డెవలపర్స్ మానేజ్ చేస్తోంది. కానీ, ట్రాన్స్ క్రిప్షన్ పై మాత్రం కాదు. సెక్యూరిటీ, ప్రైవసీ ఇంప్లికేషన్స్ నియంత్రించేందుకు గూగుల్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది అనేదానిపై ఈ కొత్త కోడ్ రివీల్ చేస్తోంది.
ఆండ్రాయిడ్ 10 నుంచి ఈ కాల్ రికార్డింగ్ అడ్డుకుంటుందని తెలిపింది. ఈ ఫీచర్ వాడే సమయంలో లోకల్ lawsకు అనుగుణంగా ఉండేలా కోడ్ స్నిప్పెట్స్ సూచిస్తోంది. ఫీచర్ ద్వారా కాల్ రికార్డు అయ్యే సమయంలో షార్ట్ వీడియో క్లిప్ ఒక ప్లే అవుతుంది. దీని ద్వారా కంపెనీ భాగస్వాములకు ఇది హెచ్చరిక జారీ చేస్తుంది. రికార్డెడ్ కాల్స్ Call log నుంచి రిపోర్టు చేస్తుంటుంది. ప్రస్తుతం Google Pixel, Android one, Xioami, యూరోపియన్ స్మార్ట్ ఫోన్లపై గూగుల్ ఫోన్ యాప్‌లో డిపాల్ట్ డయలర్ యాప్ అందిస్తోంది.