ITR కొత్త రూల్స్ : TAX పేయర్స్.. వివరాలన్నీ చెప్పాల్సిందే
ఇన్ కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ వచ్చేశాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్లు.. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయ పన్ను శాఖకు అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.

ఇన్ కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ వచ్చేశాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్లు.. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయ పన్ను శాఖకు అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
ఇన్ కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ వచ్చేశాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్లు.. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయ పన్ను శాఖకు అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం సందర్భంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫారాలను విడుదల చేసింది.
2018-19 ఆర్థిక సంవత్సర ఆదాయానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ చేసే సమయంలో మొత్తం ఏడు ఫారాలను నింపాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు పన్ను ఎగవేయకుండా పారదర్శకంగా పన్ను చెల్లించేందుకు వీలుగా ఈ కొత్త ఫారాలను ఆదాయ పన్ను శాఖ నోటిఫై చేసింది. వ్యక్తిగత పన్ను కావొచ్చు, వ్యాపార పన్ను కావొచ్చు.. తమ ప్రొఫిసెనల్, రెసిడిన్షియల్ స్థితిని తెలిపే అన్ని ఆదాయ వివరాలను కొత్త ఫారాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి
గత ఆర్థిక సంవత్సరానికి భిన్నంగా ఈ ఏడాది ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయ రాబడికి సంబంధించి ఎక్కువ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉంటున్న నివాసంలో ఎప్పటినుంచి ఉంటున్నారు, పన్ను జాబితాలో నమోదు కాని పేర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు..TDS కు అవసరమైన పాన్ కార్డు వివరాలను కూడా ఫారాల్లో తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ ఆదాయం, కంపెనీల ఆదాయం, వ్యక్తిగత ఆదాయం, విదేశీ ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు, షేర్ల ఆదాయం ఇలా నమోదు కాదని అన్ని కంపెనీల ఆదాయాల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఆదాయ పన్ను శాఖ కొత్త నిబంధనల్లో భారీ మార్పు చేశారు. ఐటీఆర్-1 ఫారమ్ దాఖలు చేసే పన్నుదారులు 80 ఏళ్ల, అంతకు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీరు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఆర్-1 లేదా సహజ్ ఫారం కింద.. రెసిడెన్షియల్ ఆదాయపన్ను దారులు తమ జీతభత్యాలు, పెన్షన్, ఇంటి ఆస్తి, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి మొత్తం ఆదాయం రూ.50 లక్షలు వరకు ఉంటే మాత్రం తప్పక ఐటీఆర్-1 ఫారం ఫైల్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయపరంగా వచ్చే ఆదాయం రూ.5వేలు, వడ్డీ ఆదాయాన్ని కూడా ఈ ఫారం దాఖలు చేయాలి.
జులై 31, సెప్టెంబర్30 ఆఖరి గడువు :
కొత్త నిబంధనల ప్రకారం.. ఐటీఆర్-1లో స్టాండర్డ్ డిడక్షన్ ఆప్షన్ కూడా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ITR దాఖలు చేసేటప్పుడు గరిష్టంగా రూ.40,000 వరకు దాఖలు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఆదాయపన్నుదారులు ఆర్థిక సంవత్సరం 2018-19 ఆదాయానికి సంబందించి ఐటీఆర్ ను వచ్చే జూలై 31లోపు ఫైల్ చేయాలి. ఇతరులకు సెప్టెంబర్ 30, 2019 వరకు గడువు ఉంది. ఇలోపు ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేదంటే.. పెనాల్టీ విధించడం జరుగుతుంది.
Read Also : ఇప్పుడు ఏమంటారు డూడ్స్ : సీఎం పట్నాయక్ Fitness మంత్రా