Work From Home New Norm : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కొత్త చట్టం.. ఫ్రేమ్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు!

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వర్క్ ఫ్రమ్ హోం (WFH) కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Work From Home New Norm : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కొత్త చట్టం.. ఫ్రేమ్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు!

Govt Looking For Ways To Regulate Wfh To Protect Employee Rights

Work From Home New Norm : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వర్క్ ఫ్రమ్ హోం (WFH) కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల్లో వారి హక్కులను కాపాడేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల పట్ల కంపెనీల బాధ్యతను నిర్వర్తించే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నియంత్రణపై సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనుంది. నివేదిక ప్రకారం.. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల హక్కులను కాపాడటమే దీని ఉద్దేశం.. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ వర్కింగ్ వంటి ఉద్యోగులను అధిక పనిఒత్తిడిని నియంత్రించడమే కాకుండా.. కొవిడ్ వైరస్ వ్యాప్తిని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టం రూపుదాల్చనుంది.

దీనిప్రకారం.. వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు పని గంటలను నిర్ణయించడం.. విద్యుత్, ఇంటర్నెట్ వినియోగం వంటి ఖర్చులను కంపెనీలే చెల్లించడం వంటివి పాలసీ నిబంధనల్లో ఉండనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోంను నియంత్రించే మార్గాలను తెలుసుకునేందుకు చర్చలు కూడా ప్రారంభమయ్యాయని ఉన్నత అధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఒక కన్సెల్టెన్సీ సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా విధానాన్ని ప్రభుత్వం.. అన్ని రంగాలకు విస్తరించాలని భావిస్తోందని అధికారి తెలిపారు. ఇప్పటికే ఇతర దేశాలు ఈ తరహా ఫ్రేమ్ వర్క్ లను అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే సేవల రంగానికి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం లాంఛనప్రాయం చేసింది. యజమానులు, ఉద్యోగులు పని గంటలు, ఇతర సేవా పరిస్థితులపై పరస్పరం నిర్ణయించుకునేలా చేసింది.

పోర్చుగల్‌లో వర్క్ ఫ్రమ్ ఉద్యోగుల కోసం కొత్త చట్టం :
పోర్చుగల్‌లో ఇటీవల వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు మద్దతుగా కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు, ఈమెయిల్‌ చేయడాన్ని పోర్చుగల్ నిషేధించింది. ఇందుకోసం ఒక కొత్త చట్టాన్నే తీసుకొచ్చింది. దీన్ని ‘విశ్రాంతి తీసుకునే హక్కు’గా పరిగణిస్తున్నారు. పోర్చుగల్‌లో వర్క్ ఫ్రం హోంను విస్తరించిన నేపథ్యంలో.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా పోర్చుగల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టం ప్రకారం.. నిర్ణీత పనిగంటల అనంతరం ఉద్యోగులకు ఆఫీస్ పనికి సంబంధించిన మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపే ఆయా కంపెనీలకు జరిమానా విధిస్తారు. 10మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న అన్ని కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలుంది. పిల్లలకు 8ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఇంటి దగ్గరి నుంచే పని చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఇంటి దగ్గరి నుంచి పని చేయడం వల్ల పెరిగే ఇంటర్నెట్, విద్యుత్ ఛార్జీలను కూడా కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి చాలావరకూ సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మొదట్లో ఇంటి నుంచి పనిచేయడం బాగానే ఉన్నప్పటికీ.. రానురాను పనివేళలతో సంబంధం లేకుండా పనిచేయాల్సి రావడం తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. ఒకవైపు పనివేళలు పెరగడంతో పాటు ఇంట్లో నుంచి పనిచేయడం వల్ల విద్యుత్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడం వంటి ఇతర ఖర్చులు భారంగా మారిపోయాయి. దాంతో వర్క్ ఫ్రమ్ ఉద్యోగులంతా ఆఫీసులకు తిరిగి వెళ్లడమే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, కరోనా ప్రభావం తగ్గిపోయి ఆఫీసులకు ఉద్యోగులంతా తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త Omicron వేరియంట్ ముప్పు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో మళ్లీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే విధానాన్ని కంపెనీలు పొడిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read Also : No Vaccine No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..లేదంటే ఇచ్చేదే లేదు : TSCAB