రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 03:26 AM IST
రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంతటి స్థాయిలో వసూలవడం ఇదే తొలిసారి. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టడానికి పన్ను శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు దోహదం చేశాయి. మార్చి నుంచి ఏప్రిల్ 30 వరకు జీఎస్టీఆర్-3బీ విక్రయ రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య 72.13 లక్షలకు చేరుకుంది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో నెల. మార్చి నెలలోనూ రూ.1.06 లక్షల కోట్లు వసూలయ్యాయి. 
Also Read : చంద్రయాన్-2: సెప్టెంబర్ 6న చంద్రునిపైకి!

గత నెలలో రూ.1,13,865 కోట్లు జీఎస్టీ ద్వారా సమకూరాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,03,459 కోట్లతో పోలిస్తే 10.05 శాతం పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.20,370 కోట్లను పంచగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.15,975 కోట్ల చెల్లింపులు జరిపింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న 50:50 రేషియో కింద ఐజీఎస్టీని రూ.12 వేల కోట్లను కేటాయించింది. గత నెలలో సీజీఎస్టీ కింద రూ.47,533 కోట్లు వసూలవగా, స్టేట్‌జీఎస్టీ కింద రూ.50,776 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చిన నాటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో అత్యధికంగా పన్ను వసూలవడం ఇదే తొలిసారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

గత రెండేళ్ల కాలంలో పన్నుల వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయని, ఎగవేతలకు చెక్ పెట్టడానికి ఐటీ అధికారుల తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపాయి. గతంలో పన్ను వసూళ్లు ఆ తర్వాతి నెలలో మూడో వారంలో విడుదల చేసేది, కానీ ప్రస్తుతం దీనిని ఈ నెల ముగిసిన మరుసటి రోజే ప్రకటిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6.10 లక్షల కోట్లను సీజీఎస్టీ కింద, పరిహారం సెస్ కింద రూ.1.01 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. అలాగే ఐజీఎస్టీ కింద మరో రూ.50 వేల కోట్లు. 2018-19 ఏడాదిలో సీజీఎస్టీ కింద రూ.4.25 లక్షల కోట్లు వసూలవగా, పరిహారం సెస్ కింద రూ.97 వేల కోట్లు వసూలయ్యాయి.

ఈ సందర్భంగా ఏఎంఆర్‌జీ భాగస్వామి రజత్ మోహన్ మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లు పెరుగడానికి పలు కారణాలని, ఈ-వే బిల్లులపై కఠిన నిబంధనలు అమలు చేయడం, రియల్ ఎస్టేట్ రంగంలో పన్నుల వసూళ్లు సరళిని మార్చివేయడం కూడా ఇందుకు కారణమని విశ్లేషించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండు రకాల పన్నులను ఎంచుకునే అవకాశం జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించడం కూడా వసూళ్లు పెరుగడానికి పరోక్షంగా దోహదం చేసిందన్నారు.
Also Read : నోటికొచ్చినట్లు ఆరోపిస్తే పరువునష్టం దావా వేస్తాం : కేటీఆర్