కస్టమర్లలో గందరగోళం : 4 బ్యాంకుల్లో ఆన్‌లైన్ సర్వీసు డౌన్

  • Published By: sreehari ,Published On : October 2, 2019 / 10:11 AM IST
కస్టమర్లలో గందరగోళం : 4 బ్యాంకుల్లో ఆన్‌లైన్ సర్వీసు డౌన్

Updated On : October 2, 2019 / 10:11 AM IST

ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అక్టోబర్ 1, 2019 (మంగళవారం) నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు నిలిచిపోయాయి. రెండు రోజులు నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు ప్రయత్నించిన కస్టమర్లు అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది కస్టమర్లకు ట్రాన్సాజెక్షన్ ఫెయిల్ అయ్యాయి. ఏమైందో తెలియక ఖాతాదారులు గందరగోళానికి గురయ్యారు. ప్రధానంగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, కోటాక్ మహీంద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, ఐడీఎఫ్ సీ బ్యాంకుల్లో ఆన్ లైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. 

ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయలేక ఆయా బ్యాంకుల కస్టమర్లు సతమతమయ్యారు. సెప్టెంబర్ 24న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ముంబై ఆధారిత బ్యాంకు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (PMC బ్యాంకు) నుంచి అన్ని వ్యాపార వ్యవహారాలపై 6 నెలల పాటు ఆంక్షలు విధించింది. ఆర్బీఐ ఆంక్షలు విధించిన వారం తర్వాత నుంచి కొన్ని బ్యాంకుల్లో ఆన్ లైన్ సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. మంగళవారం నుంచి కొన్ని గంటల పాటు ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. 

అందులో HDFC, Kotak Mahindra,Yes Bank, IDFC కస్టమర్లు లావాదేవీలు విఫలం కావడంతో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో చాలామంది బ్యాంకు కస్టమర్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాజెక్షన్ ఫెయిల్ కావడంపై ట్విట్టర్ వేదికగా కంప్లయింట్ చేశారు. బ్యాంకు అధికారిక వెబ్ సైట్లతో పాటు బ్యాంకింగ్ యాప్ సర్వీసుల్లో కూడా అంతరాయం ఏర్పడినట్టు తమ ఫిర్యాదుల్లో తెలిపారు.

ఆందోళన పడొద్దు.. పుకార్లను నమ్మెద్దు : ఆర్బీఐ
మరోవైపు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా అలర్ట్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లోని కోఆపరేటివ్ బ్యాంకులతో కలిపి ఇతర బ్యాంకులకు సంబంధించి వస్తున్న పుకార్లను ఆర్బీఐ తీవ్రంగా ఖండించింది. డిపాజిటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితమైనదని, స్థిరంగా కొనసాగుతూనే ఉంటుందని, ఇలాంటి పుకార్లపై భయపడాల్సిన పని లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సందేశాన్ని పంపింది.