Healthplix: ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఫ్లిక్స్ కొత్త రికార్డ్.. 70 వేలకి పైగా చేరుకున్న డాక్టర్ సంప్రదింపులు

H1 2023 సమయంలో వివిధ స్పెషాలిటీలలో రోజుకు సగటున 2300+ కంటే ఎక్కువ వైద్యుల సంప్రదింపులతో, నెలకు 70,000+కి పైగా సంప్రదింపులతో హెల్త్‌ప్లిక్స్ EMR ప్లాట్‌ఫారమ్‌ అగ్రగామిగా నిలిచింది

Healthplix: ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఫ్లిక్స్ కొత్త రికార్డ్.. 70 వేలకి పైగా చేరుకున్న డాక్టర్ సంప్రదింపులు

Updated On : June 20, 2023 / 9:59 PM IST

Healthplix: ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్లాట్‌ఫారమ్‌లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని దేశంలోనే అతిపెద్ద EMR ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌ప్లిక్స్ టెక్నాలజీస్ మంగళవారం ప్రకటించింది. సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో సుమారుగా 3.5 లక్షల సంప్రదింపులు ఈ వేదికపై నమోదు అవుతున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ రోజువారీ సంప్రదింపులలో 36% పెరుగుదలను చూసింది. ఇది రాష్ట్రంలో డిజిటల్ హెల్త్‌కేర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతుంది.

OnePlus 12 – Ace 2 Pro : వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ Ace 2 ప్రో డిస్‌ప్లే, స్పెషిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

H1 2023 సమయంలో వివిధ స్పెషాలిటీలలో రోజుకు సగటున 2300+ కంటే ఎక్కువ వైద్యుల సంప్రదింపులతో, నెలకు 70,000+కి పైగా సంప్రదింపులతో హెల్త్‌ప్లిక్స్ EMR ప్లాట్‌ఫారమ్‌ అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వైద్య ప్రత్యేకతలలో, డయాబెటాలజిస్టులు H1-2023లో నెలకు సగటున 15,000 సంప్రదింపులతో అగ్రశ్రేణి వినియోగదారులుగా ఎదిగారు. వారి వినియోగం నెలకు 12,000+కన్సల్టింగ్ ఫిజిషియన్‌లతో సహా 11,000+ సగటు సంప్రదింపులతో ఎండోక్రినాలజిస్ట్‌లును సైతం అధిగమించింది. కన్సల్టింగ్ ఫిజీషియన్స్, డయాబెటాలజీ, కార్డియాలజీ వంటి కీలక స్పెషాలిటీల కోసం మార్చి 2023లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని కంపెనీ వెల్లడించింది.

NSEFI కు ప్రత్యేక సంప్రదింపు హోదాను మంజూరు చేసిన ECOSOC