Smart AC: విప్లవాత్మక ఫీచర్లతో ఫ్యూచర్ స్మార్ట్‌ ఏసీలను విడుదలచేసిన హైసెన్స్‌ ఇండియా

భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు విభిన్న విభాగాలలో వినూత్నమైన, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు తీసుకురావడంపై హైసెన్స్‌ ఇండియా దృష్టిసారిస్తుంది. ఇంటెల్లి ప్రో, కూలింగ్‌ఎక్స్‌పర్ట్‌ ఎయిర్‌కండీషనర్ల ఆవిష్కరణ ఆ నిబద్ధతకు కొనసాగింపు

Smart AC: విప్లవాత్మక ఫీచర్లతో ఫ్యూచర్ స్మార్ట్‌ ఏసీలను విడుదలచేసిన హైసెన్స్‌ ఇండియా

Hisense India launched Future Smart ACs

Updated On : February 25, 2023 / 5:15 PM IST

Smart AC: కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్ అప్లయెన్సస్‌లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ హైసెన్స్‌ తమ తాజా ఎయిర్‌ కండిషనర్స్‌, ఇంటెల్లి ప్రొ, కూలింగ్‌ఎక్స్‌పర్ట్‌‭తో భారతీయ మార్కెట్‌ను విప్లవాత్మీకరించడానికి సిద్ధమైంది. తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన ఏసీలు విస్తృత శ్రేణి కలిగిన ఎక్కువ ఫీచర్ల ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో వైఫై వాయిస్‌ కంట్రోల్‌, 5 ఇన్‌ 1 కన్వర్టబల్‌ ప్రోతో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయట. ఇవి కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారెంటీతో రానున్నాయి. ఇంటెల్లిప్రో, కూలింగ్‌ ఎక్స్‌పర్ట్‌1టన్‌, 2టన్‌ సామర్థ్యంతో వస్తాయి. కేవలం 31వేల రూపాయల ప్రారంభ ధరతో వస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా హైసెన్స్‌ ఇండియా ఎండీ స్టీవెన్‌ లి మాట్లాడుతూ ‘‘భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు విభిన్న విభాగాలలో వినూత్నమైన, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు తీసుకురావడంపై హైసెన్స్‌ ఇండియా దృష్టిసారిస్తుంది. ఇంటెల్లి ప్రో, కూలింగ్‌ఎక్స్‌పర్ట్‌ ఎయిర్‌కండీషనర్ల ఆవిష్కరణ ఆ నిబద్ధతకు కొనసాగింపు. ఇంటి వద్ద సాటిలేని సౌకర్యంను వినియోగదారులకు అందించే దిశగా ఓ ముందడుగు. ఏసీ యొక్క వినూత్నమైన ఫీచర్లు వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించడం మాత్రమే కాదు విద్యుత్‌ ఆదా చేసి, ఆరోగ్యవంతమైన గృహ వాతావరణమూ అందిస్తుంది’’ అని అన్నారు.