ఇదే ప్రాసెస్: ఫేస్‌బుక్‌లో మీ ఏజ్, బర్త్ డే వివరాలు Hide చేయాలా?

సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా యూజర్ తన పేరుతో పాటు పుట్టిన తేదీ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే Facebook సహా ఇతర సోషల్ అకౌంట్లను క్రియేట్ చేసుకోగలం. యూజర్ తన పర్సనల్ వివరాల ఆధారంగా ఫేస్‌బుక్ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుంది.
సాధారణంగా ప్రతి యూజర్ తన సోషల్ అకౌంట్లో హోమ్ టౌన్, ఫోన్ నెంబర్, గత రిలేషన్ షిప్, ఎక్కడ ఉంటున్నారు.. వీటితో పాటు పుట్టినతేదీని తప్పకుండా మెన్షన్ చేస్తుంటారు. అయితే చాలామంది యూజర్లు తమ పుట్టిన వివరాలను పబ్లిక్ గా ఉంచుకోవడానికి ఇష్టపడరు.
తనకు మాత్రమే కనిపించేలా ప్రైవసీ కోరుకుంటారు. తన అకౌంట్లోని స్నేహితులు కనిపించేలా లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రమే కనిపించేలా ఉండాలని భావిస్తారు. యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఫేస్ బుక్ కూడా వారి ప్రైవసీకి తగినట్టుగా ఆప్షన్లు ఇచ్చింది.
అంటే.. యూజర్ ప్రైవసీ వివరాలను ఇతర ఫేస్ బుక్ యూజర్లకు కనిపించకుండా Hide చేసుకోవచ్చు. మీరు ఫేస్ బుక్ యూజర్ అయితే.. మీ అకౌంట్లో మీ పుట్టినతేదీని ఎలా హైడ్ చేసుకోవాలో తెలియదా? మొబైల్ డివైజ్ నుంచి ఎలా హైడ్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ (Desktop)నుంచి బర్త్ వివరాలను ఎలా హైడ్ చేసుకోవాలో ఓసారి చూద్దాం..
కంప్యూటర్‌లో Birthday Hideచేయండిలా :
* PC లేదా Mac సిస్టమ్‌లో facebook.com ఓపెన్ చేయండి.
* మీ Facebook అకౌంట్లో Login అవ్వండి.
* Profileలోకి వెళ్లి మీ Nameపై Click చేయండి.
* Edit Profile బటన్‌పై Click చేయండి.
* ఈ ఆప్షన్ FB CoverPhoto కింది భాగంలో Pencil iconతో ఉంటుంది.
* లేదంటే About సెక్షన్ పై కూడా Click చేయొచ్చు.
* కిందికి Scroll చేసి (+) Edit Your About Info అనే ఆప్షన్ Select చేయండి.
* Left Sidebarలో Contact and Basic info అనే ఆప్షన్ Select చేయండి.
* Basic Informationలో పుట్టిన తేదీ, ఇతర సంవత్సరం కనిపిస్తాయి.
* Right side పైభాగంలో People Icon పక్కన Edit icon Click చేయండి.
* మీకో Drop Down Menu కనిపిస్తుంది. అందులో Date, Year సెలెక్ట్ చేయండి.
* Birthday, Year దగ్గర ప్రతి ఆప్షన్ Public నుంచి ‘Only Me’ అని మార్చేయండి.
* Save Changes బటన్ Click చేయండి.
* అంతే.. మీ ఫేస్‌బుక్‌లో పుట్టినతేదీ వివరాలు Hide అవుతాయి.
Mobile Deviceలో Birthday Hide చేయాలంటే? :
* iPhone లేదా Android ఫోన్‌లో Facebook App ఓపెన్ చేయండి.
* మీ Facebook అకౌంట్లో Login అవ్వండి.
* కింది కుడివైపు కార్నర్ లో మూడు (===) గీతలపై Tap చేయండి.
* View Your Profile ఆప్షన్ Select చేయండి.
* Edit Profile బటన్ పై Tap చేయండి.
* కిందికి Scroll చేసి Edit Your About Infoపై Select చేయండి.
* Basic Info సెక్షన్ లో Edit అనే ఆప్షన్ Click చేయండి.
* Drop Down Listలో Birthday వివరాలను Select చేయండి.
* Privacy Settings మార్చాలనుకుంటే More Options ఎంపిక చేయండి.
* Privacy Settingను Public నుంచి Only Meకి మార్చేయండి.
* మిగతా పుట్టిన వివరాలన్నీ ఇలానే Only Meగా మార్చుకోవచ్చు.
* Page కిందికి Scroll చేశాక Save బటన్ పై Tap చేయండి.