ఎకానమీపై ‘కరోనా’ ఎఫెక్ట్ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

  • Published By: sreehari ,Published On : January 25, 2020 / 02:28 PM IST
ఎకానమీపై ‘కరోనా’ ఎఫెక్ట్ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Updated On : January 25, 2020 / 2:28 PM IST

కొత్త కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ డెడ్లీ వైరస్.. మనుషుల ప్రాణాలను బలిగొంటోంది. పాముల నుంచి సంక్రమించి ఇప్పుడు మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్.. ఫ్లూ లక్షణాలతో కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రబలి నెమ్మదిగా మరణానికి చేరువ చేస్తుంది.

ప్రస్తుతానికి ఈ వైరస్ నివారించడానికి ఎలాంటి వ్యాక్సీస్ అందుబాటులో లేదు.. యాంటీ ట్రీట్ మెంట్ కూడా లేదు. అసలు ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టింది.. అది మనుషుల్లోకి ఎలా వ్యాపించింది అనేదానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కరోనా వైరస్.. చైనా నుంచి సౌదీ వరకు పలు విదేశాలకు పాకింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. 

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు :
కరోనా వైరస్ అధిక ప్రభావం ఉన్న వుహాన్ సిటీలో మార్కెట్లన్నీ స్తంభించిపోయాయి. విమాన సర్వీసులు, బస్సులు, రైళ్లు అన్నీ రద్దు చేశారు. వుహాన్ సిటీకి లాక్ వేసారు కూడా. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అందిన నివేదికల ప్రకారం.. చైనీస్, హాంగ్ కాంగ్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కరోనా వైరస్ ప్రభావంతో మదుపరుల్లో భయాందోళన నెలకొంది. దీంతో చైనా మార్కెట్లపై ప్రభావం పడుతుందనే ఆందోళన చెందుతున్నారు. 

ముదుపుదారుల్లో భయం :
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఒకవేళ షేర్లపై ఆసక్తి చూపినా.. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ఆశించిన స్థాయిలో లాభాలు రావనే భయం పట్టుకుంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఢమాల్ అంటూ పడిపోయాయి. వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కరోనా వైరస్.. తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏదైనా ప్రకటన చేస్తే తప్ప.. ప్రపంచ ముదుపుదారుల సెంటిమెంట్ ప్రభావం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో ప్రధానంగా ట్రావెల్, ఎంటర్ టైన్ మెంట్, హాస్పిటాలిటీ రంగాలపై కూడా ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.  
Read Also : ‘కరోనా’ కాటేస్తుంది జాగ్రత్త :  విదేశాలకు వెళ్తున్నారా? వాయిదా వేసుకోండి!