SBI Annuity Deposit Scheme : ఈ SBI స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు రూ. 11వేలకు పైగా వడ్డీనే సంపాదించుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్
SBI Annuity Deposit Scheme : ఎస్బీఐ అందించే యాన్యుటీ డిపాజిట్ పథకంలో మీరు కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి నెలవారీ వడ్డీని సంపాదించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Annuity Deposit Scheme
- ఎస్బీఐలో అద్భుతమైన ప్రభుత్వ పథకం
- ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి?
- ఈ పథకంలో పెట్టుబడితో నెలకు రూ. 11వేలకుపైగా వడ్డీ
- 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు
SBI Annuity Deposit Scheme : ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుందా? అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల
ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి.
అందులోనూ సురక్షితమైన పెట్టుబడి పథకాలు చాలానే ఉన్నాయి. మీ డబ్బుతో కలిపి నెలవారీ వడ్డీని సంపాదించుకోవచ్చు. మీరు కేవలం డబ్బును ఇన్వెస్ట్ చేసి నెలవారీగా అధిక మొత్తం రాబడిని పొందవచ్చు.
సురక్షితమైన పెట్టుబడి కోసం ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ గవర్నమెంట్ స్కీమ్ ఎంచుకోవచ్చు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అందించే యాన్యుటీ డిపాజిట్ పథకం ద్వారా సురక్షితంగా పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇందులో పెట్టుబడి ద్వారా ఎంత సంపాదించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ :
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత వారికి స్థిరమైన నెలవారీ పేమెంట్ అందుతుంది. మీరు కేవలం రూ. 1,000తో ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ లేదు. మీరు ఎస్బీఐ స్కీమ్‌లో 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు ఎంత? :
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటు బ్యాంకు ఎఫ్డీ మాదిరిగానే ఉంటుంది. కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ముఖ్యంగా, పెట్టుబడిదారులు తమకు డబ్బు అవసరమైతే ఈ పథకం కాలవ్యవధిలో అసలు మొత్తంలో 75శాతం వరకు రుణం కూడా తీసుకోవచ్చు. నెలవారీ మొత్తంలో వడ్డీ, అసలు రెండూ ఉంటాయి.
మీరు ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో 10 ఏళ్ల పాటు రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 11,354 లభిస్తాయి. ఈ నెలవారీ మొత్తం 10 ఏళ్ల పాటు మీకు డిపాజిట్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా, మీరు 10 ఏళ్లలో మొత్తం రూ. 13.62 లక్షలు సంపాదించుకోవచ్చు.
