Facebookలో PDF ఫైల్స్ Upload చేయండిలా!

  • Published By: sreehari ,Published On : January 24, 2020 / 09:32 AM IST
Facebookలో PDF ఫైల్స్ Upload చేయండిలా!

Updated On : January 24, 2020 / 9:32 AM IST

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? బిజినెస్ పేజీని రన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. మీ ఫేస్‌బుక్ పేజీలో ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు కూడా పోస్టు చేసుకోవచ్చు.. అంటే.. PDF ఫైల్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలా కంపెనీలు తమ బిజినెస్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఫ్లయిర్స్, మెనూస్, బ్రోచర్స్, న్యూస్ లెటర్స్ అన్నింటిని PDF ఫార్మాట్లలో సేవ్ చేస్తుంటాయి.

ఇలాంటి ఫైల్స్ ను ఈజీగా ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసి యూజర్ ఎంగేజ్ మెంట్, కన్వర్షన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇన్ఫోగ్రాఫిక్స్ ఫైల్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఫేస్ బుక్ లో కూడా ఇలాంటి PDF ఫైల్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు.

ఫేస్ బుక్ పేజీలో పోస్టులో PDF ఫైల్స్ అప్ లోడ్ చేసేందుకు యూజర్లకు అనుమతి ఇస్తోంది. కానీ, ఈ ఫీచర్.. పర్సనల్ ప్రొఫైల్ పేజీ రన్ చేసే యూజర్లకు అందుబాటులో లేదు. ఫేస్ బుక్ బిజినెస్ పేజీ, గ్రూపుల్లో మాత్రమే ఈ PDF ఫైల్స్ అప్ లోడ్ చేసుకోనే అవకాశం ఉంది. ఫేస్ బుక్ అకౌంట్లోని బిజినెస్ పేజీలో PDF ఫైల్స్ ఎలా Upload చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

* మీరు వాడే PC లేదా Mac సిస్టమ్‌లో మీ వెబ్ బ్రౌజర్ లో Facebook.com లాగిన్ అవ్వండి.
* మీ FB అకౌంట్లో Lef Side bar లో Pages అనే ఆప్షన్ ఉంటుంది.. దానిపై క్లిక్ చేయండి.
* మీ Business pageలో Left sideలో See more పై Click చేయండి.
* About సెక్షన్ లో పై Click చేయండి.
* పేజీ కిందిభాగంలో  Add Menu అనే ఆప్షన్ పై Click చేయండి.
* Add PDF ఫైల్స్ అనే Menuపై Click చేయండి.
* పీడీఎఫ్ ఫైల్స్ అప్ లోడ్ కాగానే.. పేజీపై ప్రొఫైల్ ఫిక్చర్ కింద Menu పై క్లిక్ చేయండి.
* బిజినెస్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది.
* అంతే.. మీ పీడీఎఫ్ ఫైల్ అప్ లోడ్ అయినట్టే..

Facebook Group పేజీలో ఇలా :

* మీ ఫేస్ బుక్ అకౌంట్లో Group page ఓపెన్ చేయండి.
* Write a Post అనే బాక్సులో PDF ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి.
* లేదంటే.. More అనే ఆప్షన్ పై Click చేసి Add File ఎంపిక చేయండి.
* మీ కంప్యూటర్ లో Save చేసిన PDF ఫైల్స్ Browse చేయండి.
* PDF ఫైల్స్ తో పాటు ఏదైనా Text కూడా యాడ్ చేసి అప్ లోడ్ చేసుకోవచ్చు.
* Post ఆప్షన్ పై Click చేయండి.
* ఇతర పోస్టుల మాదిరిగానే ఈ PDF ఫైల్ పోస్టు కూడా గ్రూపు పేజీలో కనిపిస్తుంది.