Work 14 hours Day : ఉద్యోగులు రోజుకు 14 గంటలు.. వారానికి 6 రోజులు.. ఆదివారాలు పనిచేయాలి.. భారత సంతతి సీఈఓ వర్క్ పాలసీ..!

Work 14 hours Day : శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రెప్టైల్ సహ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన సీఈఓ దక్ష్ గుప్తా కూడా వివాదాస్పద వర్క్ కల్చర్ సమర్థించడం సోషల్ మీడియాలో చర్చను లేవనెత్తింది.

Work 14 hours Day : ఉద్యోగులు రోజుకు 14 గంటలు.. వారానికి 6 రోజులు.. ఆదివారాలు పనిచేయాలి.. భారత సంతతి సీఈఓ వర్క్ పాలసీ..!

Indian-origin CEO wants employees to work 14 hours a day

Updated On : November 20, 2024 / 10:14 PM IST

Work 14 hours Day : ఎట్టకేలకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి పరిపూర్ణ శిష్యుడు దొరికినట్లే.. ఎందుకంటే.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు భారత సంతతి సీఈఓ కూడా మూర్తి వర్క్ ఫార్మూలా గురించే చెబుతున్నాడు. స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగులు రోజుకు 14 గంటలు, వారానికి 6 రోజులతో పాటు కొన్నిసార్లు ఆదివారాలు కూడా పనిచేయాలని సూచిస్తున్నాడు.

ఇటీవలే భారత్‌లో ‘1986లో 6 రోజుల నుంచి 5 రోజుల పనివారానికి మారడం పట్ల ఇన్ఫోసిస్ మూర్తి తన నిరాశను వ్యక్తం చేయడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. మూర్తి ఏమన్నారంటే.. “మనం ఈ దేశంలో కష్టపడి పనిచేయాలి. శ్రమకు ప్రత్యామ్నాయం లేదు. మీరు చాలా తెలివైన వ్యక్తి అయినప్పటికీ, మీరు కష్టపడి పనిచేయాలి. నేను నా అభిప్రాయాలను వెనక్కి తీసుకోను. నా తుది శ్వాస వరకు ఇదే మాటపై నిలబడతాను” అని చెప్పుకొచ్చారు.

మూర్తి వర్క్ బ్యాలెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇప్పుడు మూర్తి తగ్గ శిష్యుడు దొరికినట్టు కనిపిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ గ్రెప్టైల్ సహ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన సీఈఓ దక్ష్ గుప్తా కూడా వివాదాస్పద వర్క్ కల్చర్ సమర్థించడం సోషల్ మీడియాలో చర్చను లేవనెత్తింది.

గ్రెప్టైల్ కంపెనీ వర్క్ షెడ్యూల్‌ గురించి గుప్తా వివరించాడు. ఉద్యోగులు ఎక్కువ గంటలు, అధిక ఒత్తిడి, తక్కువ పని-జీవిత సమతుల్యతను ఎదుర్కొంటున్నారని అన్నాడు. దీనిపై నెట్టింట్లో విమర్శలకు దారితీసింది.

“ఇటీవలే, గ్రెప్టైల్ కంపెనీ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను అందించదని మొదటి ఇంటర్వ్యూలో అభ్యర్థులకు చెప్పాను. సాధారణ పనిదినాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. తరచుగా శనివారాలు, కొన్నిసార్లు ఆదివారాలు కూడా పని చేస్తాం. 6 రోజుల పనికి ఒక ఉద్యోగిని 84 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయాలి” అని చెప్పుకొచ్చారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి.

అయితే, గుప్తా గ్రెప్టైల్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మోడల్ అత్యంత తీవ్రమైనదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారదర్శకత చాలా బాగుంది. అయితే, ఉత్పాదకతను పెంచడానికి వారాంతాల్లో సెలవులు ఇచ్చే బదులు మీ కంపెనీని విజయవంతం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరో యూజర్.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కార్మికులను దోచుకుంటున్నారని ఆరోపించారు. మీరు ఇప్పటికే కాలేజీల నుంచి నేరుగా ఉద్యోగులను దోపిడీ చేయడం చాలా బాగుంది” అని కామెంట్ చేశాడు.

నెటిజన్ల కామెంట్లపై గుప్తా స్పందిస్తూ.. ’20 శాతం బెదిరింపులు, 80 శాతం ఉద్యోగ దరఖాస్తులకు మిశ్రమంగా ఉందని పేర్కొన్నారు. ఈ పని విధానం శాశ్వతంగా ఉండకూడదన్నారు. ఎందుకంటే ఇది స్థిరమైనది కాదని అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ.. పని-జీవిత సమతుల్యతపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఉదాహరణగా తీసుకుని “ప్రధాని మోదీ బహుశా వారానికి 100 గంటలు పనిచేస్తారు. వారికి మన మన పని ద్వారానే కృతజ్ఞతను తెలియజేయగలమని పేర్కొన్నారు.

Read Also : Apple Security Update : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఆపిల్ కొత్త ఐఓఎస్ 18.1.1 సెక్యూరిటీ అప్‌‌డేట్.. ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోండి!