అదీ పాకిస్థాన్ స్థాయి.. మొత్తం పాక్ స్టాక్ మార్కెట్ వాల్యూ కలిపినా మన ఒక్క ఇన్ఫోసిస్ కంటే తక్కువే…
India Infosys : పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను ఇన్ఫోనిస్ ఒకే ఒక్క భారతీయ కంపెనీ అధిగమించింది.

India Infosys
India Infosys : భారత్‌తో పెట్టుకుంటే అంతే.. అది యుద్ధమైనా.. స్టాక్ మార్కెట్ అయినా.. పాక్ స్టాక్ మార్కెట్ మొత్తం ఒక్క ఇండియా కంపెనీ ముందు తేలిపోయింది. పాకిస్తాన్ ఆర్థిక పరంగా ఇండియా కన్నా అత్యంత అధ్వాన్న స్థితికి చేరింది అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. ఒక్క మాటలో చెప్పాలంటే.. పాక్ మొత్తం స్టాక్ మార్కెట్ వాల్యూ కలిపినా కూడా మన భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్ కన్నా చాలా తక్కువగా ఉంది. అది పాకిస్తాన్ స్థాయి అనమాట..
భారత్, పాకిస్తాన్ కాల్పుల మధ్య ఉద్రిక్తత సమయంలో భారత్ సైన్యం గట్టిగా బదులిచ్చింది. పాక్ కుటిల బుద్ధిని తిప్పికొట్టి తోకముడిచేలా చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో భారత్ పాక్ సైన్యంపైనే కాదు.. ఆర్థిక పరంగా కూడా పైచేయి సాధించింది.
భారత స్టాక్ సూచీలు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. కానీ, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX)లోని ప్రధాన కంపెనీల కన్నా ఒకే ఒక్క భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్ ఆధిపత్యాన్ని కనబర్చింది. పాక్ స్టాక్ కంపెనీల కన్నా ఇన్ఫోసిస్ ముందంజలో నిలిచింది.
PSXలో ఉన్న 476 ప్రధాన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 5.66 లక్షల కోట్లు. అదే సమయంలో, భారత ఏకైక లార్జ్-క్యాప్ కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 6.26 లక్షల కోట్లు (శుక్రవారం నాటి డేటా ప్రకారం)గా నమోదైంది. మొత్తం పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మొత్తం కలిపినా ఇన్ఫోసిస్ కన్నా తక్కువగా నమోదైంది.
భారత ఆర్థిక వ్యవస్థ విలువ 4 ట్రిలియన్ డాలర్లు. పాకిస్తాన్ జీడీపీ కేవలం 350 బిలియన్ డాలర్లు. PSX మొత్తం విలువ హిందూస్తాన్ యూనిలీవర్ (రూ. 5.48 లక్షల కోట్లు) కన్నా కొంచెం ఎక్కువ.
పాకిస్తాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE-100 మార్కెట్ క్యాప్ రూ. 3.31 లక్షల కోట్లు. భారత అల్ట్రాటెక్ సిమెంట్ (రూ. 3.34 లక్షల కోట్లు) కన్నా తక్కువనే చెప్పాలి.
మల్టీనేషనల్ కంపెనీల మధ్య వ్యత్యాసం :
పాకిస్తాన్‌లోని నెస్లే, కోల్గేట్-పామోలివ్, పాకిస్తాన్ టొబాకో, యూనిలీవర్ ఫుడ్స్, GSK, అబాట్ వంటి టాప్ రేంజ్ 6 మల్టీనేషనల్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.36,660 కోట్లు.
అదే సమయంలో భారత్ మార్కెట్లో ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 14.8 లక్షల కోట్లు. దాదాపు 40 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్‌లో రూ. 17,978 కోట్లుగా ఉంటే.. భారత్‌లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదైంది.
పాకిస్తాన్ మార్కెట్లో అతిపెద్ద కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ (OGDC) మార్కెట్ క్యాప్ రూ. 23,812 కోట్లు..
శుక్రవారం నమోదైన డేటా ప్రకారం.. భారత ONGC కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,95,322గా నమోదైంది. అంటే.. OGDC విలువ భారత జేబీ కెమికల్స్ (రూ. 23,787 కోట్లు)కు సమానం. భారతీయ కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ (రూ. 27,986 కోట్లు) కన్నా కూడా తక్కువే.
7.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్న OGDC GDR రూ. 28వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే.. భారత NLC ఇండియా (రూ. 30వేల కోట్లు) కన్నా కూడా తక్కువ. అదే సమయంలో BSE ఇండియా మార్కెట్ క్యాప్ రూ. 88,969 కోట్లు కాగా, PSX మార్కెట్ క్యాప్ కేవలం రూ. 527 కోట్లు మాత్రమే.
ఫార్చ్యూన్ ఇండియా విశ్లేషణ ప్రకారం.. ఒక పాకిస్తానీ రూపాయి కరెన్సీ మార్పిడి ఆధారంగా రూ.0.30, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX)లో జాబితా చేసిన 476 ప్రముఖ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.66 లక్షల కోట్లుగా ఉంది. అది కూడా భారతీయ ఇన్ఫోసిస్ లార్జ్-క్యాప్ స్టాక్ రూ. 6.26 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కన్నా తక్కువే.
వాస్తవానికి, హిందుస్తాన్ యూనిలీవర్ ఒక్కటే రూ.5.48 లక్షల కోట్లు. మొత్తం PSX వాల్యుయేషన్‌తో దాదాపు సమానంగా ఉంటుంది. పాకిస్తాన్ బెంచ్‌మార్క్ అయిన KSE-100 ఇండెక్స్ సమిష్టిగా కేవలం రూ. 3.31 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ రూ. 3.34 లక్షల కోట్ల కన్నా తక్కువగా నమోదైంది.
టైటాన్ కంపెనీకి దగ్గరగా (రూ.3.11 లక్షల కోట్లు). అదానీ పోర్ట్స్ SEZ (రూ. 2.82 లక్షల కోట్లు)తో 20శాతంగా ఉంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (రూ. 2.78 లక్షల కోట్లు) దగ్గరగా ఉంది.
మల్టీనేషనల్ కంపెనీల (MNCs) విషయానికి వస్తే.. పాకిస్తాన్‌లో టాప్ 6 MNC కంపెనీలు నెస్లే, కోల్గేట్-పామోలివ్, పాకిస్తాన్ టొబాకో, యూనిలీవర్ ఫుడ్స్, GSK, అబాట్ సమిష్టిగా కేవలం రూ. 36,660 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉన్నాయి. అదే కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 14.8 లక్షల కోట్లకు మించి ఉంది.
పాకిస్తాన్ మల్టీనేషనల్ సంస్థలు : రూ. 17,978 కోట్లు
భారతీయ మల్టీనేషనల్ కంపెనీలు : రూ. 1.73 లక్షల కోట్లు
విశేషమేమిటంటే.. హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వ్యక్తిగతంగా 6 పాకిస్తానీ మల్టీనేషనల్ సంస్థల మొత్తం విలువను అధిగమించాయి.