iOS 18 Update Release : ఐఓఎస్ 18 అప్‌డేట్ చెక్ చేశారా? సపోర్టు చేసే ఐఫోన్లు ఇవే.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
iOS 18 Update Release : ఐఓఎస్ 18ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అర్హత ఉన్న డివైజ్‌లు ఏంటి? కొత్త ఫీచర్‌లను ఎలా డౌన్‌లోడ్ చేయాలో వివరంగా పరిశీలిద్దాం.

iOS 18 now rolling out for select iPhones _ How to download, new features and more
iOS 18 Update Release : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఈరోజు (సెప్టెంబర్ 16) నుంచి భారతీయ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్ 18ని అధికారికంగా రిలీజ్ చేయడం ప్రారంభించింది. ఐఫోన్‌ల కోసం ఈ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మొత్తం ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచే విధంగా కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్ రేంజ్ ప్రవేశపెట్టింది.
ఐఓఎస్ 18తో వినియోగదారులు ఈ ఏడాది ప్రారంభంలో (WWDC 2024) డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెట్టిన కస్టమ్ హోమ్ స్క్రీన్, రీడిజైన్ చేసిన కంట్రోల్ సెంటర్, అడ్వాన్స్‌డ్ సఫారి, మ్యాప్స్ వంటి మరిన్ని ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. ఐఓఎస్ 18ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అర్హత ఉన్న డివైజ్‌లు ఏంటి? కొత్త ఫీచర్‌లను ఎలా డౌన్‌లోడ్ చేయాలో వివరంగా పరిశీలిద్దాం.
iOS 18 డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
మీ ఐఫోన్ అప్‌డేట్‌కు అర్హత కలిగి ఉన్నంతవరకు, మీ ఐఫోన్‌లో iOS 18ని డౌన్‌లోడ్ చేయడం చాలా సులభం. డౌన్‌లోడ్ చేసే ముందు, మీ ఐఫోన్ తగినంతగా ఛార్జ్ ఉండేలా చూసుకోండి. ప్రాధాన్యంగా 50 శాతం కన్నా ఎక్కువ. మీకు స్టేబుల్ వై-ఫై కనెక్షన్ ఉంది.
- మీ ఐఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి ఎనేబుల్ చేయండి.
- ఈ కిందికి స్క్రోల్ చేసి, “General”పై ట్యాప్ చేయండి.
- “సాఫ్ట్‌వేర్ అప్‌డేట్” ఆప్షన్ ఎంచుకుని దానిపై ట్యాప్ చేయండి.
- మీ డివైజ్ అర్హత ఉంటే.. iOS 18 అప్‌డేట్ ఉందో లేదో చూడాలి.
- ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఎనేబుల్ చేసే “డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయి”పై ట్యాప్ చేయండి.
- మీ పాస్‌కోడ్‌ని రిజిస్టర్ చేయమని ప్రాంప్ట్ చేయొచ్చు.
మీ ఐఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఆధారంగా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌కు కొంత సమయం పట్టవచ్చు. ఆపిల్ ఐఓఎస్ 18కి అధికారిక రిలీజ్ తేదీగా సెప్టెంబర్ 16ని ప్రకటించినప్పటికీ, రోల్ అవుట్‌కి కొంత సమయం పట్టవచ్చని గమనించండి. మీకు వెంటనే అప్‌డేట్ కనిపించకపోతే, మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.
ఐఓఎస్ 18 అర్హత కలిగిన ఐఫోన్లు :
ఐఫోన్ 16 సిరీస్ ఐఓఎస్ 18 ప్రీ-ఇన్‌స్టాల్‌తో వస్తుండగా, ఇప్పటికే ఉన్న అనేక ఐఫోన్ మోడల్‌లు కూడా అప్‌డేట్‌ను పొందుతాయి. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ మొత్తం 25 డివైజ్‌లకు సపోర్టును విస్తరిస్తోంది. అయితే, అన్ని ఐఫోన్లు ప్రతి ఫీచర్‌కు సపోర్టు చేయవని గమనించాలి.
ప్రత్యేకించి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, కొత్త మోడల్‌లకు ప్రత్యేకంగా ఉంటాయి. మొత్తం ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కూడా మోడల్స్ కూడా ఉన్నాయి. ఐఓఎస్ 18 అప్‌డేట్‌కు సపోర్టు చేసే ఐఫోన్ మోడల్స్ ఇవే.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
- ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్
- ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
- ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
- ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
- ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
- ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్
- ఐఫోన్ ఎస్ఈ (2వ జనరేషన్), ఐఫోన్ ఎస్ఈ (3వ జనరేషన్)