iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ (Flipkart Diwali Sale) కొనసాగుతోంది. అందరికి కొన్ని ఆకట్టుకునే డీల్‌లు స్టోర్‌లో ఉన్నాయి. మీరు ఐఫోన్ 14ని పొందాలనుకుంటే.. స్పెషల్ సేల్ సమయంలో ఐఫోన్ రూ. 14,900 తగ్గింపుతో పొందవచ్చు.

iPhone 14 available at Rs 14,900 discount as part of Flipkart Diwali sale
iPhone 14 Discount Sale : పండుగ సీజన్ వచ్చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ అవుట్లెట్లు దీపావళి విక్రయాలలో భాగంగా కొన్ని భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ (Flipkart Diwali Sale Offers) సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14) కొనేందుకు ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఐఫోన్ 14 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీ పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ధరను మరింత తగ్గించవచ్చు. అయితే, మీరు పొందే తగ్గింపు అనేది మీ ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 14లో ఫ్లిప్‌కార్ట్ డీల్ గురించి మరింత తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14, 128GB వేరియంట్ ధర రూ. 14,901 ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ.69,900 ఉండగా.. రూ. 54,999కి విక్రయిస్తోంది. అంతేకాదు.. మరెన్నోబ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ. 1,000 వరకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
Read Also : WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లో 31 మందితో గ్రూపు కాల్ చేసుకోవచ్చు..!
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఐఫోన్ 14ని ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు. మీ ఫోన్ మెరుగైన కండిషన్లో ఉంటే.. అధిక తగ్గింపుకు పొందవచ్చు. మీ ప్రాంతంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు అర్హత కలిగి ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ఫ్లిప్‌కార్ట్‌లో వెబ్సైట్లో మీ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

iPhone 14 available at Rs 14,900 discount
భారత్‌లో ఐఫోన్ 14 డీల్ ఎంతంటే? :ఐఫోన్ 14 గతేడాది భారత్‌లో లాంచ్ అయింది. లైనప్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14, 2021 ఐఫోన్ 13 మధ్య చాలా తేడాలు ఉన్నప్పటికీ, ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు ప్రాసెసర్, డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్ వంటి కొన్ని మార్పులను కలిగి ఉన్నాయి. అదే డైనమిక్ ఐలాండ్ నాచ్ ఇప్పుడు అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13తో పోలిస్తే.. ఐఫోన్ 14 కెమెరా కొన్ని అప్‌గ్రేడ్స్ కలిగి ఉంది. ఉదాహరణకు, తక్కువ-కాంతిలో ఫోటోగ్రఫీ, బ్యాక్ కెమెరాలో ఫోటోనిక్ ఇంజిన్ని అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 ఫీచర్లు సమానంగా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 రెండూ 12MP కెమెరాలపై ఆధారపడతాయి. రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. ఐఫోన్ 13 ‘/2.2 ఎపర్చరుతో పోలిస్తే.. ఐఫోన్ 14 మోడల్ 1.9 ఎపర్చరును కలిగి ఉంది. కొత్త ఫోన్‌కు మరింత కాంతిని అందించడంలో సాయపడుతుంది. ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరాలో మొదటిసారిగా ఆటో-ఫోకస్ ఫీచర్‌ను కూడా ప్రదర్శిస్తుంది.
Read Also : Lava Blaze 2 5G Launch : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. భారీ బ్యాటరీతో లావా బ్లేజ్ 2 5G ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..!