iPhone 15 Price : ఐఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ ధర తగ్గింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఏకంగా రూ. 11,400కే తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15 Price : ఐఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

iPhone 15 Price

Updated On : July 13, 2025 / 2:35 PM IST

iPhone 15 Price : కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు అందిస్తోంది. లాస్ట్ జనరేషన్ ఐఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో (iPhone 15 Price) రూ. 11,400 కన్నా ఎక్కువ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 15 ధర అధికారికంగా రూ. 79,900 వద్ద లాంచ్ కాగా, ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత రూ. 69,900కు తగ్గింది. అయితే, ఇప్పుడు, అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఇంకా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఐఫోన్ 15 డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర రూ.59,499కి లిస్ట్ అయింది. రూ.10,401 ప్రత్యేక తగ్గింపు ధరతో వస్తుంది. కస్టమర్లు SBI లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.1,000 బ్యాంక్ ఆఫర్‌ పొందవచ్చు. తద్వారా ధర రూ.58,499కి తగ్గుతుంది.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి!

మీకు SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్ లేకపోతే.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,784 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, కస్టమర్లు తమ పాత ఫోన్‌ను కొత్త ఐఫోన్ 15 కోసం ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ.47,150 ఎక్స్ఛేంజ్ వాల్యూ (కండిషన్, మోడల్ ఆధారంగా) పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రూ.2,885 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు (iPhone 15 Price) :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల OLED ప్యానెల్‌తో 60Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. మంచి బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఐఫోన్ 15లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. IP68 రేటింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.