iPhone Maker Foxconn: బెంగళూరులో ఆపిల్ సంస్థ భాగస్వామి ‘ఫాక్స్‌కాన్’ భారీగా పెట్టుబడులు.. చైనాలో ఆందోళన

ఆపిల్ సంస్థ భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్ లో కొత్త ప్లాంట్ కోసం రూ.5.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేసేందుకు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఈ పెట్టబడులు పెట్టనున్నట్లు సమాచారం. అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతింటున్న నేపథ్యంలో ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి తరలించాలని ఆపిల్ భావిస్తోంది.

iPhone Maker Foxconn: బెంగళూరులో ఆపిల్ సంస్థ భాగస్వామి ‘ఫాక్స్‌కాన్’ భారీగా పెట్టుబడులు.. చైనాలో ఆందోళన

iPhone Maker Foxconn

Updated On : March 3, 2023 / 5:08 PM IST

iPhone Maker Foxconn: ఆపిల్ సంస్థ భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్ లో కొత్త ప్లాంట్ కోసం రూ.5.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేసేందుకు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఈ పెట్టబడులు పెట్టనున్నట్లు సమాచారం. అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతింటున్న నేపథ్యంలో ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి తరలించాలని ఆపిల్ భావిస్తోంది.

చైనాలోని పరిస్థితులు ఐఫోన్ల ఉత్పత్తుల విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ చాలా కాలంగా భారత్ లో ఐఫోన్ ప్లాంట్లపై ఆసక్తి చూపుతోంది. ఫాక్స్‌కాన్‌ తైవాన్ కు చెందిన సంస్థ. బెంగళూరు ఎయిర్ పోర్టుకి సమీపంలో 300 ఎకరాల సైట్లో ఐఫోన్ పార్టుల తయారీ ప్లాంటును అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేసుకుంటోంది.

అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సైట్లోనే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తమ ఎలక్ట్రానిక్ వాహనాల పార్టులను కూడా ఉత్పత్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్ లో ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెడుతుండడం చైనాకు ఆందోళన కలిగించే విషయమే.

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ లో ప్రపంచంలోనే అదిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న చైనా తనకు ఉన్న ఆ హోదాను కోల్పోయే ముప్పును కొనితెచ్చుకుంటోంది. ఆపిల్ సహా ఇతర అమెరికా బ్రాండ్లు చైనాను వదిలి భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలిపోవాలని భావిస్తున్నాయి.

చైనా, అమెరికా మధ్య సత్సంబంధాలు క్షీణించడమే కాక, చైనాలో పాటించిన జీరో కొవిడ్ విధానం, కఠిన లాక్ డౌన్ వల్ల ఈ దేశానికి ఈ పరిస్థితులు వచ్చాయి. ఉక్రెయిన్ లో యుద్ధం కూడా ఈ పరిస్థితులకు దారి తీస్తోంది. కాగా, బెంగళూరులో ఆపిల్ సంస్థ భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ పెట్టుబడుల వల్ల దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి. చైనాలోని జెంగ్జౌలోని ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్ లో దాదాపు 2 లక్షల మంది పనిచేస్తున్నారు.

Visakha Global Investors summit : ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయి : మంత్రి గడ్కరి