సెప్టెంబర్ 30న లాంచ్ : IRCTC IPOలో రూ.650 కోట్లు ఆఫర్

భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 30న IPO (ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్ ను IRCTC లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వరకు IPO షేర్లపై సబ్ స్ర్కిప్షన్ ఓపెన్ అయి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం.. IPO షేర్లపై అత్యధికంగా రూ.635.04 నుంచి రూ.645.12 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి కంపెనీకి షేర్ సేల్ కు సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు.
IPO డేటా ప్రకారం.. ఐఆర్ సీటీసీలో ప్రభుత్వం వాటా 12.5శాతానికి తగ్గనుంది. రైల్వే PSU మాత్రం ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ విలువ రూ.315 నుంచి రూ.320గా సెట్ చేసింది. రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.10 డిస్కౌంట్ ధరతో IRCTC ఆఫర్ చేస్తోంది.
ఇందులో కనిష్టంగా బిడ్ లాట్ 40 షేర్లు వరకు ఫిక్స్ చేసింది. ఆ తర్వాత దానికి రెట్టింపు కానుంది. రైల్వే మంత్రిత్వశాఖ అందించే 2కోట్ల షేర్లకు (మొత్తంగా చెల్లించిన ఈక్విటీ 12.50శాతం) ఐఆర్ సీటీసీ ఐపీఓ ఒక పూర్తి ఆఫర్ చెప్పుకోవచ్చు. అడిషనల్ ఎంప్లాయ్ రిజర్వేషన్ పోర్షన్ లో 1.6 లక్షల షేర్లు కూడా ఉన్నాయని సంస్థ తెలిపింది.
ఐఆర్ సీటీసీ IPOలో ఐడీబిఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఎస్ సెక్యూరిటీస్ (ఇండియా) బుకింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. వచ్చే నవరాత్రి పండుగ సీజన్ లో రైల్వే PSU.. ఐఆర్ టీసీ IPO స్టాక్ మార్కెట్ ను సెప్టెంబర్ 29న లాంచ్ చేయనుందని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఆన్ లైన్ సెప్టెంబర్ 13న రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఆగస్టులో క్యాపిటల్ మార్కెట్ వాచ్ డాగ్ SEBIతో డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను ఐఆర్ సీటీసీ ఫైల్ చేసింది. ఆర్థిక సంవత్సరం 2018-19లో రైల్వే దిగ్గజం రూ.1,899 కోట్ల రాబడిని జనరేట్ చేసింది.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25శాతం ఎక్కువ. అదే ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి ఐఆర్ సీటీసీ నికర ఆదాయం 23.5శాతానికి ఎగిసి రూ.272.50 కోట్లకు చేరింది. IRCTCలోని DRHP డేటా ప్రకారం.. నెలకు 2.5 కోట్ల లాగిన్ అవుతుంటే.. రోజుకు 72లక్షల లాగిన్ అవుతున్నాయి. ఆసియా పసిఫిక్ రీజియన్ లోని కస్టమర్లు రోజుకు 8 లక్షల టిక్కెట్లను బుక్ చేస్తుండటంతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ కు క్రమంగా ఆదరణ పెరిగింది.