Dollar-Rupee: భారత స్వాతంత్ర్యం నాటికి డాలర్, రూపాయి సమానంగా ఉండేవా? అసలెందుకు రూపాయి అంతలా పడిపోయింది?

ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, కొంతకాలంగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 80-85 రేంజ్‌లో ఉంది. శుక్రవారం (ఆగస్టు 11, 2023) నాటికి ఇంటర్‌బ్యాంకింగ్ కరెన్సీ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఒక డాలర్ విలువ 82.96 రూపాయలకి సమానం. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 84కి పడిపోయింది

Dollar-Rupee: భారత స్వాతంత్ర్యం నాటికి డాలర్, రూపాయి సమానంగా ఉండేవా? అసలెందుకు రూపాయి అంతలా పడిపోయింది?

USD-INR: అమెరికా అనేక దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతోంది. అమెరికా కరెన్సీ అయిన డాలర్ పరిస్థితి కూడా అదే. ప్రపంచ వాణిజ్యంలో ఓవైపు ఆధిపత్యం కొనసాగిస్తూనే విలువైన కరెన్సీగా చెలామణి అవుతోంది. అయితే ఇది ఒకప్పటి మాట కాదు. ఒకప్పుడు మన రూపాయి కూడా డాలర్‌తో పోటీపడే పరిస్థితి ఉండేది. కానీ తర్వాత పరిస్థితి మారిపోయి నేటి కాలంలో డాలర్‌తో భారత రూపాయి పోటీ పడలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం డాలర్‭కు 80 రూపాయలు పలుకుతోందంటే.. గడిచిన 75 ఏళ్లలో రూపాయి ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు.

Priyanka Gandhi Vadra: సోనియా, రాహుల్ తర్వాత ఇప్పుడు ప్రియాంక వంతు.. ఇంతకీ రాబర్ట్ వాద్రా ఏం చెప్పారు?

1947లో భారత రూపాయి విలువ డాలర్‌తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉందని తరచూ చర్చ సాగుతుంటుంది. మీరు కూడా ఇలాంటి చర్చ చాలా సార్లు విని ఉంటారు, కొన్నిసార్లు అందులో మీరూ ఓ మాట కలిపే ఉంటారు. అయితే ఇది నిజం కాదు. కానీ, ఆ సమయంలో భారత రూపాయి విలువ డాలర్‌కు చాలా సమీపంగా ఉండేదని మాత్రం వాస్తవం. కానీ సమానంగా లేదా అంతకంటే ఎక్కువ లేదు.

1947లో రూపాయి విలువ ఎంత?
ఈరోజుల్లో వివిధ కరెన్సీల మార్పిడి వ్యవస్థ ఉంది. దీనిని ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ అంటారు. దశాబ్దాల క్రితం అంటే 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు అలాంటిది లేదు. అటువంటి పరిస్థితిలో ప్రతి చర్చలో అనేక రకాల వాదనలు ఉంటాయి. ఫారెక్స్ మార్పిడి వ్యవస్థ 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందంతో ప్రారంభమైంది. క్రమంగా అది అంతర్జాతీయ ప్రమాణాల రూపాన్ని సంతరించుకుంది. స్వాతంత్య్రానంతరం ఆ ఒప్పందంలో భారతదేశం భాగమైంది. దాని ప్రకారం లెక్కిస్తే 1947లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దాదాపు 3.30 రూపాయలు ఉండేది. అంటే 1947లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మరీ అంత బలంగా ఏమీ లేదు. ఇక రెండూ సమానమనే వాదన పూర్తిగా అవాస్తవం.

ఒక్కసారైనా డాలర్ కంటే రూపాయి బలంగా ఉందా?
చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రూపాయి విలువ డాలర్ కంటే ఒక్కసారైన ఎక్కువగా ఉందా అని.. మనం కాస్త వెనక్కి వెళ్లినట్లైతే, ఆర్థిక వ్యవస్థ నుంచి కరెన్సీ వరకు ప్రతిదానిని లెక్కించే వ్యవస్థ మనకు లేదు. ఏది ఏమైనప్పటికీ, బ్రిటీష్ వలసరాజ్యంగా మారడానికి ముందు భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందనేది మాత్రం వాస్తవం. అందువల్ల రూపాయి విలువ ఎక్కువగా ఉందని వివిధ అంచనాలు వస్తుంటాయి. బ్రిటన్ వుడ్స్ ఒప్పందం ఫార్ములా ప్రకారం, ఒకప్పుడు రూపాయి విలువ వాస్తవానికి డాలర్ కంటే ఎక్కువ అని కూడా చూపిస్తుంది. 1913లో ఇలాంటిది ఉన్నట్లు కొన్ని ఆధారాలైతే చెప్తున్నాయి. అయితే దీనిని మనం ప్రామాణికంగా తీసుకోలేము.

Assam: పార్టీ నేతతో వివాహేతర సంబంధం.. సోషల్ మీడియాలో ఫొటోలు.. గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మహిళా నేత

ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, కొంతకాలంగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 80-85 రేంజ్‌లో ఉంది. శుక్రవారం (ఆగస్టు 11, 2023) నాటికి ఇంటర్‌బ్యాంకింగ్ కరెన్సీ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఒక డాలర్ విలువ 82.96 రూపాయలకి సమానం. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 84కి పడిపోయింది. రానున్న కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 85 దిగువకు పడిపోయే అవకాశం ఉంది. ఈ చార్ట్ 1947 నుంచి డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎలా బలహీనపడిందనే దాని గురించి మనకు ఒక ఆలోచన ఇస్తుంది.

ఈ 5 సందర్భాలలో విలువ వేగంగా పడిపోయింది
స్వాతంత్ర్యం తర్వాత డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎందుకు బలహీనపడిందో చూస్తే.. దీనికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది, దశాంశీకరణ రూపాయి విలువను తగ్గించింది. ఈ పని 1957లో ఒక రూపాయిని 100 పైసలుగా విభజించినప్పుడు జరిగింది. ఆ తర్వాత 1966 నాటి ఆర్థిక సంక్షోభం ఒక్కసారిగా రూపాయి విలువ 57 శాతం పడిపోయింది. 1991 ఆర్థిక సంక్షోభం అనంతరం రూపాయి విలువ బాగా తగ్గింది. 1991 ఆర్థిక సంక్షోభం, సరళీకరణ కారణంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 35 రూపాయల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో రూపాయి విలువలో భారీ క్షీణత చోటు చేసుకుంది. ఆ సమయంలో చాలా ఎమర్జింగ్ కరెన్సీలు విలువ తగ్గింపు బారిన పడ్డాయి. చివరికి, 2016 నాటి డీమోనిటైజేషన్ కూడా ఒక్కసారిగా రూపాయి విలువను తగ్గించింది.