Isha Ambani : స్మిత్‌సోనియన్‌ ఏషియన్ ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా ఇషా అంబానీ

ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఇషా అంబానీ నియమితులయ్యారు.

Isha Ambani : స్మిత్‌సోనియన్‌ ఏషియన్ ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా ఇషా అంబానీ

Isha Ambani Joins Board Of Trustees Of The Smithsonian’s National Museum Of Asian Art

Updated On : October 28, 2021 / 3:41 PM IST

Smithsonian’ National Museum: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. వరల్డ్ ఫేమస్ స్మిత్‌సోనియన్‌ (Smithsonian Institution) నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఇషా అంబానీ నియమితులయ్యారు. ఇషాతో పాటు మరో ఇద్దరి కొత్త పేర్లు (Carolyn Brehm, Peter Kimmelman)ను కూడా బోర్డు ప్రకటించింది.

ఈ ట్రస్ట్‌ బోర్డులో సభ్యుల్లో ఒకరైన ఇషా అంబానీ అత్యంత పిన్న వయస్కురాలు.. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. వాషింగ్టన్ డిసీలోని నేషనల్ మాల్‌లో ఉన్న ఈ మ్యూజియం.. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఎడ్యుకేషన్‌గా పేరుంది. అయితే.. స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌‌ను 1923లో ప్రారంభించారు.
Moto Watch 100 : మోటరోలా కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది… ఫీచర్లు ఇవేనా?

మరోవైపు.. 2023లో ఈ ట్రస్ట్ వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ వేడుకలను నిర్వహించే బాధ్యత కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులదే. ఈ మ్యూజియంలో 17మంది సభ్యుల్లో యూనైటెడ్ స్టేట్స్ చీఫ్ జస్టిస్, వైస్ ప్రెసిడెంట్ సభ్యులుగా ఉన్నారు. అలాగే యూనిటైడ్ స్టేట్స్ సెనేట్, యూనైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్స్ ముగ్గురు సభ్యులు, తొమ్మది మంది అమెరికా పౌరులు ఉన్నారు. ఈ మ్యూజియం నిర్వహణ విషయంలో వీరికే బాధ్యతలు అప్పగించారు.

అమెరికాలో వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఈ స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌లో వివిధ అద్భుత కళాఖండాలు ఉన్నాయి. అందులో భారత్, మెసపోటనియా, జపాన్‌, చైనాలకు చెందిన 45వేలకు పైగా చారిత్రక చిత్రాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. రాతి యుగం నుంచి నేటి అధునాత యుగం వరకు ఏషియా నాగరికతను గుర్తుచేసే అనేక కళాఖండాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
Hidden Charges: హిడెన్ ఛార్జీల పేరుతో రూ.9వేల 700కోట్ల బ్యాంకు దోపిడీ