ITR Filing Date : టాక్స్ పేయర్లకు బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 15 తర్వాత ITR గడువు తేదీ మళ్లీ పొడిగిస్తారా? ఇందులో నిజమెంతా?!

ITR Filing Date : 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు.

ITR Filing Date : టాక్స్ పేయర్లకు బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 15 తర్వాత ITR గడువు తేదీ మళ్లీ పొడిగిస్తారా? ఇందులో నిజమెంతా?!

ITR Filing Date

Updated On : July 30, 2025 / 12:15 AM IST

ITR Filing Date : టాక్స్ పేయర్లకు బిగ్ న్యూస్.. ఐటీఆర్ డెడ్‌లైన్ మళ్లీ పొడిగించే అవకాశం ఉందంటూ ఓ వార్త వినిపిస్తోంది. అదేగాని జరిగితే, పన్ను చెల్లింపుదారులకు నిజంగా రిలీఫ్ అని చెప్పొచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే.. 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. అయితే, మళ్లీ ఈ గడువు తేదీ పొడిగిస్తారని భావిస్తున్నారు.

ITR ఫారమ్‌ల (ITR-1, 2, 3, 4) ఎక్సెల్ యూజర్ల కోసం యుటిలిటీ ఫారమ్‌లు ఆలస్యంగా జారీ అయ్యాయి. అలాగే, సిస్టమ్ అప్‌గ్రేడ్, కొత్త రిపోర్టింగ్ రూల్స్ కారణంగా కూడా ఆలస్యం జరిగింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఎలాంటి తొందరపాటు లేకుండా దాఖలు చేసుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ వెరిఫై చేసుకోవడానికి దాదాపు 50 రోజుల అదనపు సమయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు చేసే తేదీని మళ్లీ పొడిగిస్తారో లేదో చూడాలి.

ఏ ఫారమ్‌ ఇంకా రిలీజ్ లేదు :
ITR-5, 6, 7 ఫారమ్‌ల ఎక్సెల్ యుటిలిటీలు ఇంకా రిలీజ్ కాలేదు. అలాగే, ITR-3 ఆన్‌లైన్ దాఖలు కోసం JSON ఆధారిత యుటిలిటీ ఇంకా అందుబాటులో లేదు. ప్రస్తుతం ఈ ఫారమ్ ఎక్సెల్ ఫార్మాట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : Cardless Withdrawals : ఏటీఎంలో డబ్బులు తీయాలా? డెబిట్ కార్డుతో పనిలేదు.. ఈ 6 సింపుల్ స్టెప్స్ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు..

గడువును మరింత పొడిగిస్తారా? :
ఐటీఆర్ దాఖలకు సెప్టెంబర్ 15 వరకు గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ గడువు తేదీని మరింత పొడిగించవచ్చు అని టాక్స్ పేయర్లలో ప్రశ్న తలెత్తుతోంది. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కానీ, కొన్ని ఫారమ్‌ల కోసం యుటిలిటీ ఇంకా రిలీజ్ చేయలేదు. దాంతో టాక్స్ పేయర్లకు దాఖలు చేసే సమయం తగ్గవచ్చు. గత కొన్ని ఏళ్లుగా సాంకేతిక ఇబ్బందులు లేదా ఆలస్యం జరిగినప్పుడల్లా సీబీడీటీ గడువును పొడిగించింది. ఈసారి కూడా అది జరిగే అవకాశం ఉంది.

ఎవరికి ప్రయోజనం? :
జీతం పొందే ఉద్యోగులు, HUF అకౌంట్లకు ఆడిట్ పరిధిలోకి రాని వారికి ఈ గడువును పొడిగించారు. ఈ వ్యక్తులు ఐటీఆర్‌ను సెప్టెంబర్ 15, 2025 వరకు ఆలస్య రుసుము లేకుండా దాఖలు చేయవచ్చు. మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయకపోతే మీకు ఇంకా సమయం ఉంది. కానీ, చివరి తేదీ వరకు ఉండకుండా వీలైనంత త్వరగా రిటర్న్ దాఖలు చేయండి. తద్వారా ఎలాటి పెనాల్టీ పడదు.