iVoomi e-scooters : ఇప్పుడే కొనేసుకోండి.. ఐవూమీ ఇ-స్కూటర్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

iVoomi e-scooter Discounts : ఈవీ స్టార్టప్ ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 10వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iVoomi e-scooters : ఇప్పుడే కొనేసుకోండి.. ఐవూమీ ఇ-స్కూటర్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

iVoomi announces discounts of up to Rs 10k on e-scooter range

iVoomi e-scooter Discounts : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. పూణేకు చెందిన ఈవీ స్టార్టప్ ఐవూమీ (iVOOMi) కంపెనీ మొత్తం రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో రూ.10వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ పరిమిత-కాల తగ్గింపు ఆఫర్‌లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ కింద కస్టమర్లు ఫ్లాగ్‌షిప్ ఈవీ, జీటెక్స్ స్టిక్కర్ ధరపై రూ. 10వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు . ఇంకా S1, S1 2.0 ఇ-స్కూటర్ల మోడళ్లపై రూ. 5వేల తగ్గింపు పొందవచ్చు.

Read Also : Hyundai Creta Sales : భారత్‌లో హ్యుందాయ్ క్రెటా జోరు.. అమ్మకాల్లో 10లక్షల యూనిట్ల మైలురాయి దాటేసింది!

ఐవూమీ ఇ-స్కూటర్లపై తగ్గింపు : 65కి.మీ గరిష్ట వేగం :
ఐవూమీ ఇ-స్కూటర్లలో జీటెక్స్ మోడల్ ధర ఇప్పుడు రూ. 89,999గా నిర్ణయించింది. ఇందులో 2.5కిలోవాట్ మోటారుతో కలిసి 2కిలోవాట్ లియాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 65 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుంది. జీటెక్స్ మోడల్ బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత 110 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు.

మరోవైపు.. ఐవూమీ S1 మోడల్ ఇప్పుడు రూ. 5వేల తగ్గింపు తర్వాత రూ.79,999కి అందుబాటులో ఉంది. ఈ మోడల్ 2.1కిలోవాట్ బ్యాటరీతో ఆధారితమైనది. స్టేబుల్‌మేట్ మాదిరిగా 110 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. అదేవిధంగా, ఐవూమీ S1 2.0 మోడల్ రూ. 82,999 ఉండగా.. కేవలం రూ. 10 విలువైన విద్యుత్‌తో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని తయారీదారు స్పష్టం చేసింది.

ఐవూమీ (iVoomi) ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ :
అన్ని ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను స్మార్ట్ క్లౌడ్-కనెక్ట్ చేసిన ఇ-స్కూటర్‌లకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు వంటి ఫీచర్లను అందిస్తాయి. తద్వారా వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ అప్‌గ్రేడ్ కోసం రూ. 3వేలు అదనంగా ఖర్చు అవుతుంది.

Read Also : OnePlus Watch 2 Launch Date : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? ఈ నెల 26న వన్‌ప్లస్ వాచ్ 2 సిరీస్ వచ్చేస్తోంది.. కేవలం రూ.99కే బుకింగ్ ఆఫర్