Bank Holiday : బిగ్ అలర్ట్.. జనవరి 12న బ్యాంకులకు సెలవు ఉందా? బ్యాంకుకు వెళ్లే ముందు చెక్ చేసుకోండి!

Bank Holiday : జనవరి 12, సోమవారం బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి? అనే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Bank Holiday : బిగ్ అలర్ట్.. జనవరి 12న బ్యాంకులకు సెలవు ఉందా? బ్యాంకుకు వెళ్లే ముందు చెక్ చేసుకోండి!

Bank Holiday (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 8:50 PM IST
  • జనవరి 12న సోమవారం బ్యాంకులకు హాలీడేనా?
  • ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి
  • ఆ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులు పనిచేయవు
  • మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయి

Bank Holiday : మీకు బ్యాంకులో పని ఉందా? జనవరి 12న బ్యాంకులకు సెలవు ఉందా? ఒకవేళ ఉంటే ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసా? మీరు కూడా సోమవారం బ్యాంకులకు వెళ్లే ముందు అసలు సెలవు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వాస్తవానికి, ఇప్పుడు వచ్చే సోమవారం బ్యాంకులు పనిచేస్తాయా? లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జనవరి 12 బ్యాంకులకు సెలవు లేదు :
ఈ 12వ తేదీన దేశమంతటా బ్యాంకులకు వర్కింగ్ డే. ఈ తేదీన ఒక రాష్ట్రంలో తప్పా అన్ని రాష్ట్రాల్లో ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారమే బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాలతో పాటు చెక్కు క్లియరెన్స్, NEFT, RTGS, IMPS సర్వీసులు, లాకర్ సౌకర్యాలు ఈ రోజున అన్ని పనిచేస్తాయి.

జనవరి 12 హాలిడే కానప్పటికీ కస్టమర్లు ఈ కింది సూచనలను తప్పక పాటించాలి. ఏమైనా ఆర్థిక పరమైన లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేయండి. డిజిటల్ బ్యాంకింగ్‌ ఎక్కువగా ఉపయోగించండి.

Bank Holiday

Bank Holiday (Image Credit To Original Source)

జనవరి 12 బ్యాంకులకు సెలవు :
ఈ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బ్యాంకులకు మాత్రమే సెలవు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉండే కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. పశ్చిమ బెంగాల్ మినహా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఓపెన్ అయి ఉంటాయి.

Read Also : Motorola Edge 50 Pro 5G : అద్భుతమైన 50MP సెల్ఫీ కెమెరాతో ఈ మోటోరోలా 5G ఫోన్ జస్ట్ రూ. 24,999కే.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఈ రాష్ట్రంలోనే ఎందుకు? :
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లో జనవరి 12న బ్యాంకులు పనిచేయవు. ఈరోజున బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అందుకే ఈ రోజును ప్రతి ఏడాది జనవరి 12న జరుపుకుంటారు.