July Retail Inflation: 7.01 నుంచి 6.71 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం.. అయినప్పటికీ..
దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు పారిశ్రామిక ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ నివేదిక విడుదల చేసింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతంగా నమోదైందని తెలిపింది. జూన్ తో పోల్చితే జూలైలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గిందని పేర్కొంది. జూన్ లో ద్రవ్యోల్బణం 7.01గా ఉండగా, అంతకు ముందు నెల 7.04 శాతంగా ఉంది. గత నెల 6.71 శాతానికి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. మార్చి నుంచి ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణం ఇదే. అయితే, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశించిన స్థాయి కన్నా ఇది వరుసగా ఏడో ఏడాది కూడా అధికంగా నమోదైంది.

Inflation
July Retail Inflation: దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు పారిశ్రామిక ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ నివేదిక విడుదల చేసింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతంగా నమోదైందని తెలిపింది. జూన్ తో పోల్చితే జూలైలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గిందని పేర్కొంది. జూన్ లో ద్రవ్యోల్బణం 7.01గా ఉండగా, అంతకు ముందు నెల 7.04 శాతంగా ఉంది. గత నెల 6.71 శాతానికి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. మార్చి నుంచి ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణం ఇదే. అయితే, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశించిన స్థాయి కన్నా ఇది వరుసగా ఏడో ఏడాది కూడా అధికంగా నమోదైంది.
సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ నిర్దేశించిన విషయం తెలిసిందే. గత నెల ఆహార ధరలను కేంద్ర ప్రభుత్వం సడలించడం, అలాగే, ఇంధన ధరలు అంతగా ప్రభావం చూపకపోవడంతో ద్రవ్యోల్బణం తగ్గింది. 2022 చివరినాటికి రెపోరేటు 6 శాతానికి చేరనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రెపోరేటును ఇటీవలే 50 బేసిస్ పాయింట్లు (బీపీసీ) పెంచుతూ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అది 5.40 శాతానికి చేరింది. భారత్ కరోనా విజృంభణ అనంతరం ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచింది.