అణు ఫ్యూజన్ అధ్యయనం కోసం ‘మేడిన్ ఇండియా’.. కీలక డివైజ్ పంపిన భారత్!

భారత్.. ‘మేక్ ఇన్ ఇండియా’ దిశగా మరో అడుగు ముందుకేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 20 బిలియన్ డాలర్ల గ్లోబల్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ కోసం క్రియోస్టాట్‌ను రూపొందించి పెద్ద మైలురాయిని సాధించింది. ఇంజనీరింగ్, నిర్మాణ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో ప్రకారం.. ఫ్రాన్స్‌లో నిర్మించే ప్రపంచంలోని అతిపెద్ద అణు ఫ్యూజన్ రియాక్టర్‌లో కీలకమైన మేడిన్ ఇండియా క్రియోస్టాట్ డివైజ్‌ను గ్లోబల్ ప్రాజెక్టు కోసం భారత్ పంపించింది. ఫైనల్ అసెంబ్లీ లేదా టాప్ లిడ్ సెక్టార్స్‌ను గుజరాత్, సూరత్ జిల్లాలోని కంపెనీకి చెందిన Hazira manufacturing complex నుంచి పంపించింది.
లార్సెన్ & టూబ్రో (L & T) 2012లో ITER-ఇండియా క్రియోస్టాట్‌ను తయారు చేసి న్యూక్లియర్ ఫ్యూజన్‌లో ఇన్ స్టాల్ చేసేందుకు ఎంపిక చేసింది. 3,850 టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైన వాక్యూమ్ ప్రెజర్ నౌకగా దీన్ని పిలుస్తారు. భారత్, లార్సెన్ & టూబ్రోలకు ఇదెంతో గర్వకారణమని ఎల్ అండ్ టి గ్రూప్ చైర్మన్ AM నాయక్ ప్రశంసించారు. గ్లోబల్ ప్రాజెక్టులో కీలకమైన ‘క్రియోస్టాట్’ డివైజ్ సాయంతో అణు ఫ్యూజన్‌పై అధ్యయనంలో భారత్ సాయపడుతోంది.
ఇండియాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ (L & T) ఇంజనీరింగ్ విభాగం, ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్-స్టీల్, హై-వాక్యూమ్ ప్రెజర్ చాంబర్ అయిన క్రియోస్టాట్ అత్యంత క్లిష్టమైన తుది సముదాయాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసింది. గ్లోబల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిను అందుకుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా చొరవకు గర్వకారణమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 650 టన్నుల బరువున్న క్రియోస్టాట్ అసెంబ్లీని దక్షిణ ఫ్రాన్స్‌లోని రియాక్టర్ పిట్‌లో PTIR (International Thermonuclear Experimental Reactor) కోసం ఇతర క్రియోస్టాట్ విభాగాలతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
L & T ఇప్పటికే క్రియోస్టాట్ కోసం బేస్ సెక్షన్ పంపించేసింది. లోయర్ సిలిండర్, ఎగువ సిలిండర్‌ను పంపిణీ చేసింది. ఫ్యూజన్ రియాక్టర్‌కు కూలింగ్ అందించనుంది. రియాక్టర్ కేంద్రంలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి ఈ క్రియోస్టాట్ పనిచేస్తుంది. భవిష్యత్ శక్తినిచ్చే అత్యంత ప్రతిష్టాత్మక స్వచ్ఛమైన శక్తి ప్రాజెక్టు అపరిమిత కార్బన్ రహిత శక్తి కోసం క్రియోస్టాట్ వెసెల్ చివరి విభాగాన్ని ఫ్లాగ్-ఆఫ్ చేయడానికి ఐటిఇఆర్‌కు నిరంతరాయ సరఫరాను నిర్ధారించడానికి కంపెనీ వినూత్న, డిజిటల్ తయారీ పద్ధతులను ఉపయోగించినట్లు సుబ్రహ్మణన్ చెప్పారు.
ఫ్రాన్స్‌లోని ప్రాజెక్ట్ స్థలంలో క్రియోస్టాట్ మార్గం సుగమం చేస్తుందని అన్నారు. ఐటిఇఆర్ 20 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్ కాంపోనెంట్ లో 9 శాతం భారతదేశం సహకరిస్తోందని చెప్పారు. టాప్ లిడ్ సెక్టార్ సరఫరాతో, షెడ్యూల్ కంటే ముందే ప్రాజెక్ట్ భారతదేశ పరిధిని విజయవంతంగా పూర్తి చేసామని అంటున్నారు. ఈ పార్టుల రూపకల్పన దాని భారీ పరిమాణం కఠినమైన నాణ్యత ప్రమాణాల పరంగా ఇంజనీరింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. L& T హెవీ ఇంజనీరింగ్ కోసం ప్రాజెక్ట్ పరిధిని మూడు కోణాలుగా విభజించినట్లు కంపెనీ తెలిపింది.