Kia Seltos Facelift Bookings : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. జూలై 4న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Kia Seltos facelift : భారత మార్కెట్లో ఎంపిక చేసిన కియా డీలర్‌షిప్‌లు 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారు కోసం బుకింగ్‌లను అంగీకరిస్తున్నాయి.

Kia Seltos facelift unofficial bookings open, get details here
Kia Seltos facelift : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా (Kia) నుంచి సరికొత్త మోడల్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు వచ్చే జూలై 4న లాంచ్ కానుంది. ఇప్పటికే కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ అనాధికరిక బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ బుకింగ్స్ ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లతో వాహనాన్ని రిజర్వ్ చేసేందుకు రూ. 25వేల టోకెన్ మొత్తాన్ని అంగీకరించాయి. మిడ్ -సైజ్ SUVని జూలై 4న లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో మాత్రమే ఈ కియా సెల్టాస్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేయాలని భావిస్తున్నారు.
కియా ఇండియా సెల్టోస్‌కు బాహ్య, ఇంటీరియర్ రెండింటిలోనూ చాలా మార్పులు చేసింది. సెల్టోస్ 2023 కొత్త హెడ్‌లైట్లు, DRLలు, టెయిల్‌లైట్‌లను కలిగి ఉంది. ఈ లైట్లన్నీ ప్రాథమికంగా LED యూనిట్లను కలిగి ఉండనుంది. గ్రిల్ కూడా రీడిజైన్‌తో అందిస్తుంది. అవుట్‌గోయింగ్ మోడల్‌లో కనిపించే దానికంటే చాలా పెద్దదిగా ఉంటుంది. అల్లాయ్ వీల్స్ కూడా కొత్తవి. ఫ్రంట్, బ్యాక్ బంపర్‌లు కూడా రివీల్ అయ్యాయి.
సెల్టోస్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లో పనోరమిక్ యూనిట్ ద్వారా వస్తుంది. ఇతర పోటీదారుల్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్నాయి. 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌కు మరో ముఖ్యమైన ఫీచర్ ADAS కూడా యాడ్ చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం.. వాహనంపై 16 ఫీచర్లను అందిస్తుంది.

Kia Seltos facelift unofficial bookings open, get details here
మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోని మరో మోడల్.. MG ఆస్టర్ మాత్రమే ADASని కలిగి ఉంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించి వెహికల్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC) వ్యవస్థను అప్‌డేట్ చేసినట్టుగా వెల్లడించాయి. సెగ్మెంట్-ఫస్ట్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ని కూడా అందిస్తుంది. HVAC యూనిట్ కింద కొత్త మీడియా కంట్రోల్ ఉన్నాయి.
కియా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెల్టోస్ 2023 ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. కొత్త సెల్టోస్‌లో 3 ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. 1.5-లీటర్ పెట్రోల్ (115PS/144Nm), 1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ T-Gdi పెట్రోల్ (160PS/253Nm), 1.5-లీటర్ CRDi VGT డీజిల్ (116PS/250Nm).
ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT, 7-స్పీడ్ DCT ఉన్నాయి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతం సేల్‌లో ఉన్న మోడల్ ధర రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.