Gold Rate: ఈ న్యూ ఇయర్‌లోనూ తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. కాకపోతే ఇలాగైతే తగ్గొచ్చేమో..?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం అవ్వగానే అప్పటివరకు పెరుగుతున్న బంగారం రేట్లు కాస్త తగ్గడం ప్రారంభించాయి.

Gold Rate: ఈ న్యూ ఇయర్‌లోనూ తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. కాకపోతే ఇలాగైతే తగ్గొచ్చేమో..?

Updated On : January 16, 2025 / 2:59 PM IST

కొత్త సంవత్సరంలో బంగారం ధర తగ్గుతుందేమో అని గంపెడు ఆశతో ఎదురుచేసిన వాళ్లకి నిరాశ తప్పడం లేదు. ఎందుకంటే గత నెలలో బంగారం ధర 10 గ్రాములకు రూ.60 వేలకు పడిపోతుంది అనే న్యూస్ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం రేటు అసలు తగ్గేదేలే అంటూ విపరీతంగా పెరుగుతోంది.

మన ఇండియాలో బంగారానికి ఉన్న విలువ మరేదానికి లేదు పండగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు ఇంకా ఏ పండుగ జరిగినా ఆ వేడుక కోసం మనం బంగారం కొనాల్సిందే. మొదట్లో ఇష్టంతో లేక పరువు, ప్రతిష్ఠ కోసం బంగారాన్ని కొన్నప్పటికీ.. ఇంట్లో ఫైనాన్సియల్ గా స్ట్రగుల్ తలెత్తినప్పుడు బంగారం ఉంటే ఓ భరోసా ఇస్తుందనే నమ్మకం చాలా మందికి తెలిసిన విషయమే. బంగారం కూడా దాని విలువని పెంచుకుంటూ.. మనల్ని కాపాడుతోంది.

అసలు బంగారం రేటు ఎందుకు పెరుగుతోందో తెలుసా.. ?

  • ఉక్రెయిన్‌-రష్యా వంటి రెండు దేశాల మధ్య యుద్ధలు, అమెరికా, స్విట్జర్లాండ్‌లలో వంటి దేశాలు కార్పొరేట్ బ్యాంకులు ఏదో కారణం చేత దివాలా తీయడం
  • మనం చూస్తూనే ఉంటాం కిలోల కొద్దీ బంగారంని కొని దానిని బ్యాంకు లాకర్ లలో నిల్వ చేస్తుంటారు కొందరు. దాని వల్ల కూడా పసిడి ధర పెరుగుతుంది
  • బిజినెస్ ఇన్వెస్టుమెంట్ కోసం డబ్బులు లేకపోవడం వలన బంగారాన్ని పెట్టుబడిగా పెట్టడం
  • డబ్బు ఉన్నవాళ్లు బంగారాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో వాడడం వలన
  • బ్యాంకులో మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం

బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉందా..?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం అవ్వగానే అప్పటివరకు పెరుగుతున్న బంగారం రేట్లు ఒక్కసారిగా తగ్గడం ప్రారంభించాయి. ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగి స్టాక్ మార్కెట్లో లాభాల్లోకి వెళ్లాయి దాని ఫలితమే కావచ్చు. ఈ నెల 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి, పూర్తి స్థాయిలో అధ్యక్ష నిగా వచ్చిన తరువాత బంగారం రేట్ తగ్గవచ్చు. అప్పుడు బంగారం ధర రూ.60 వేల కి దిగివచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే బంగారం ధర తగ్గుతుంది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా కరోనా లాంటి మహమ్మారిలు వచ్చినపుడు బంగారం ధరలో మార్పు ఉండవచ్చు.

US డాలర్ విలువ తగ్గినపుడు, సెంట్రల్ బ్యాంక్ పాలసీలలో మార్పులు వస్తే అపుడు డబ్బును పొందడం కష్టం అవుతుంది . దీనివలన బంగారం తగ్గే సూచనలు ఉంటాయి. ఇవేవీ జరగకపోతే ఈ ఏడాది కూడా బంగారం ధరలు పెరుగుతాయి.