వామ్మో బంగారం ధర : లెటెస్టు రేట్లు

  • Published By: madhu ,Published On : December 29, 2019 / 07:52 AM IST
వామ్మో బంగారం ధర : లెటెస్టు రేట్లు

Updated On : December 29, 2019 / 7:52 AM IST

వామ్మో ఏం బంగారం ధరలు ఇవి అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే..మధ్య తరగతి ప్రజలు కోనలేనంతగా. అవును నిజం. లెటెస్ట్ గా పసిడి ధరలు రూ. 40 వేలను క్రాస్ చేసింది. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుందని ఆశించారు. కానీ అలా జరగడం లేదు. రోజు రోజుకు ధరలు అధికం అవుతుండడంతో బంగారం కొనలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రతి వస్తువు ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.

* బంగారం కొనాలనే వారు ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారానికి ఫుల్ డిమాండ్ ఉండడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. 
 

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 39 వేల 300కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 38 వేల 100కు చేరుకుంది. 
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 40 వేల 690కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 37 వేల 300కు చేరుకుంది. 

మరి బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.

నగరం 22 క్యారెట్ 24 క్యారెట్
చెన్నై రూ. 37, 300 రూ. 40, 690
ముంబై రూ. 37, 950 రూ. 38, 950
ఢిల్లీ రూ. 38, 100 రూ. 39, 300
కోల్ కతా రూ. 38, 390 రూ. 39,510
బెంగళూరు రూ. 36, 650 రూ. 39,980
విజయవాడ రూ. 37, 300 రూ. 40, 690
విశాఖపట్టణం రూ. 37, 300 రూ. 40, 690