ఎల్ఐసీ పాలసీ.. రోజుకు జస్ట్ రూ.40 పొదుపు చేసి భవిష్యత్తులో ₹25 లక్షలు పొందండి.. ఫుల్ డిటెయిల్స్..

మీరు రోజుకు జస్ట్ రూ.40 పొదుపు చేస్తే.. భవిష్యత్తులో ₹25 లక్షలు పొందండి.. అంతేగాక మీకు జీవితాంతం రక్షణ అందిస్తుంది. ఫుల్ డిటెయిల్స్..

  • Published By: Mahesh T ,Published On : February 8, 2025 / 09:52 AM IST
ఎల్ఐసీ పాలసీ.. రోజుకు జస్ట్ రూ.40 పొదుపు చేసి భవిష్యత్తులో ₹25 లక్షలు పొందండి.. ఫుల్ డిటెయిల్స్..

Updated On : February 8, 2025 / 9:54 AM IST

LIC New Jeevan Anand Policy: LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ రెండు రకాల ప్రయోజనాలు అందిస్తుంది. ఇది పాలసీదారు కుటుంబానికి రక్షణ ఇస్తుంది. అలాగే పొదుపు సమపాళ్ళలో అందిస్తుంది. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, ప్రీమియం చెల్లింపు గడువు పూర్తయిన తర్వాత కూడా పాలసీదారునికి జీవితాంతం రక్షణ అందిస్తుంది.

ఈ పాలసీ ద్వారా సౌలభ్యవంతమైన ప్రీమియం చెల్లింపు చేయొచ్చు. పాలసీదారు కనీసం రెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీని సరెండర్ చేసుకోవచ్చు.

LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ముఖ్య లక్షణాలు:

  • ఇది ఒక ఎండోవ్మెంట్ పాలసీ. దీని ద్వారా బోనస్‌లతో కలిపి డబ్బు వస్తుంది.
  • పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా, పాలసీ యజమాని బతికుంటే, మెచ్యూరిటీ ప్రయోజనాలు అందించబడతాయి.
  • పాలసీదారు మరణించిన సందర్భంలో, నామినీకి హామీ మొత్తం అందించబడుతుంది.

Also, Read: Delhi Election Results 2025: ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్‌ దాటిన బీజేపీ

LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అర్హత & నిబంధనలు

  • పాలసీకి కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు
  • పాలసీ మెచ్యూరిటీ వయస్సు: 75 సంవత్సరాలు
    కనీస పాలసీ గడువు: 15 సంవత్సరాలు
  • గరిష్ట పాలసీ గడువు: 35 సంవత్సరాలు
  • కనీసం పాలసీ మొత్తం : రూ.1,00,000
  • గరిష్ట పాలసీ మొత్తం అనేదానికి ఎలాంటి పరిమితి లేదు.

రూ.25 లక్షలు ఎలా వస్తాయి?

  • ఒక వ్యక్తి 18 ఏళ్ల వయస్సులో రూ.5 లక్షల సుమ్ అస్యూర్డ్‌తో 35 ఏళ్ల కాలానికి ఈ పాలసీ తీసుకున్నట్లయితే:
  • నెలవారీ పెట్టుబడి: సుమారు రూ.1,120 (రోజుకు రూ.37)
  • వార్షిక పెట్టుబడి: సుమారు రూ.14,399
  • మొత్తం చెల్లించిన ప్రీమియం: రూ.4,93,426

మెచ్యూరిటీ ప్రయోజనాలు:

  • పాలసీ మొత్తం విలువ: రూ.5 లక్షలు
  • బోనస్: రూ.8.575 లక్షలు
  • అంతిమంగా అదనపు బోనస్: రూ.11.50 లక్షలు
  • మొత్తం మెచ్యూరిటీ మొత్తం: రూ.25 లక్షలు

ఇక, పాలసీదారు సడన్ గా మరణిస్తే, LIC పాలసీ మీద 125% చెల్లిస్తుంది.

LIC New Jeevan Anand Policy Document Official PDF >> Click Here