Delhi Election Results 2025: ఢిల్లీలో చరిత్ర సృష్టించాం.. ఇక డబుల్ ఇంజిన్ సర్కారు పాలన చూస్తారు: మోదీ
న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ ఓడిపోయారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆప్ రెండో స్థానానికే పరిమితం అయింది. కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది.
LIVE NEWS & UPDATES
-
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం- అతిశీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాకు దెబ్బే. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది.
-
ఢిల్లీకి ఉన్న ఆప్ ద పోయింది: ప్రధాని మోదీ
ఇంతకాలం ప్రజలకు సేవ చేయనివ్వకుండా చేశారు
ఆందోళనలతో మెట్రో పనులు కదలనివ్వకుండా చేశారు
పేదలకు ఇళ్లు ఇవ్వనివ్వకుండా చేశారు
ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఢిల్లీ వాసులకు అందనివ్వలేదు
-
షార్ట్ కట్ లీడర్లకు జనం బుద్ధి చెప్పారు: ప్రధాని మోదీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయం అనంతరం ప్రధాని మోదీ స్పీచ్
రాజకీయాల్లో షార్ట్ కట్ కి ప్లేస్ లేదు
షార్ట్ కట్ రాజకీయ నేతలకు జనం బుద్ధి చెప్పారు
ఇక నుంచి ఢిల్లీలో బీజేపీ పాలన చూస్తారు
ఢిల్లీ అనేది దేశరాజధాని మాత్రమే కాదు
ఇది మినీ హిందుస్తాన్
-
ఢిల్లీకి ఓనర్లు ఢిల్లీ ఓటర్లే.. అహంభావులను జనం తిప్పికొట్టారు: మోదీ
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం ప్రధాని మోదీ స్పీచ్
ఈ విజయం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలదే
బీజేపీ కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు
ఢిల్లీకి అసలు ఓనర్ ఢిల్లీ ప్రజలే నని ఓటర్లు స్పష్టం చేశారు
ఢిల్లీకి ఓనర్ అవుదామనుకునే అహంభావులను తిప్పికొట్టారు
-
అభివృద్ధికి, నమ్మకానికి ప్రజలు పట్టం కట్టారు: ప్రధాని మోదీ
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం ప్రధాని మోదీ స్పీచ్
ఢిల్లీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది
అభివృద్ధికి, నమ్మకానికి ప్రజలు పట్టం కట్టారు
ఆడంబరాలు, అరాచకాలు, అహంకారులను ఓడగొట్టారు
-
ఢిల్లీ సీఎం ఎవరో త్వరలోనే తెలుస్తుంది- పర్వేశ్ వర్మ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడించి సంచలన సృష్టించారు పర్వేశ్ వర్మ. తద్వారా సీఎం రేసులోనూ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. ఢిల్లీలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఢిల్లీని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతుందన్నారు.
సీఎం రేసులో ఉన్నారా? అనే ప్రశ్నపై ఆయన స్పందించారు. పార్టీ నాయకత్వం, లెజిస్లేచర్ పార్టీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం ఎవరనేది త్వరలోనే మీకు తెలుస్తుందన్నారు.
-
ఢిల్లీ ప్రజలు మార్పునకు ఓటు వేశారు- ప్రియాంకా గాంధీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రియాంకా గాంధీ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..'' ఢిల్లీ ప్రజలు మార్పునకు ఓటు వేశారు. రాజధాని ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారు. ప్రస్తుత పరిస్థితిని మార్చాలని అనుకున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు. ఇక మనం చేయాల్సిందల్లా మరింత కష్టపడి పని చేయడమే. క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రజల సమస్యలపై బాధ్యతగా పోరాడాలి''.
-
మిల్కీపుర్ ఉపఎన్నికలో బీజేపీ విజయం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపుర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాసవాన్ విజయం సాధించారు. సమీప సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై 61వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ లోక్‌సభ ఎంపీగా ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
-
కేజ్రీవాల్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: ఎంపీ మనోజ్ తివారీ
ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీలపై ఢిల్లీ ఓటర్లు నమ్మకం ఉంచారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విషయంలో గర్వంగా ఉన్నామని, ప్రతి కార్యకర్తకు తివారీ ధన్యవాదాలు తెలిపారు.
-
ఢిల్లీ సచివాలయం సీజ్.. ఆప్ ఓటమితో ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఎల్జీ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్జీ సూచనలతో సచివాలయాన్ని సీజ్ చేయాలని జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు.
-
ఢిల్లీ ఓటర్లకు ధన్యవాదాలు.. అభివృద్ధి మా గ్యారంటీ : ప్రధాని మోదీ
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజాశక్తే అత్యున్నతమని, ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలనలు విజయం సాధించాయన్నారు.
ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇది తమ గ్యారంటీగా మోదీ వెల్లడించారు.जनशक्ति सर्वोपरि!
विकास जीता, सुशासन जीता।
दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।
दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम…
— Narendra Modi (@narendramodi) February 8, 2025
-
ఆప్ కీలక నేతల ఫలితాలు
ఓటమి
- న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ ఓటమి
- జంగ్ పురా నుంచి మనీష్ సిసోడియా ఓటమి
- గ్రేటర్ కైలాశ్ నుంచి సౌరబ్ భారద్వజ్ ఓటమి
- షాకుర్ బస్తి నుంచి సతేంద్ర జైన్ ఓటమి
గెలుపొందిన నేతలు
- కల్కాజి నుంచి గెలుపొందిన అతిశీ
- బాబర్ పూర్ నుంచి గెలుపొందిన గోపాల్ రాయ్
- బల్లిమారన్ నుంచి గెలుపొందిన ఇమ్రాన్ హుస్సేన్
-
ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?
-
ఓటమిపై కేజ్రీవాల్
ఎన్నికల్లో బాగా పోరాడిన ఆప్ శ్రేణులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీరును శిరసావహిస్తున్నామని చెప్పారు. విజయం సాధించిన బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
-
దేవుడి శిక్షపడింది: స్వాతి మలివాల్
ఢిల్లీలో ఆప్‌కు ఘోర ఓటమి ఎదురవుతున్న వేళ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందించారు. మహిళలకు అన్యాయం చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడని అన్నారు. ఢిల్లీలోని నీటి, గాలి కాలుష్యం, వీధుల్లో నెలకొన్న పరిస్థితుల వల్లే కేజ్రీవాల్ కూడా ఆయన సీటును కోల్పోయారని చెప్పారు.
-
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఇది ముఖ్యం: నిర్మల
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. మోదీ నిర్దేశించుకున్న 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఇది చాలా ముఖ్యమని చెప్పారు.
-
ఇప్పటివరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
-
అతిశీ విజయం
ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. మొదటి రౌండ్లలో వెనుకంజలో కొనసాగిన ఆమె.. చివరి రౌండ్లో పుంజుకుని బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై స్వల్ప తేడాతో గెలిచారు.
-
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ సాహిబ్ సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతో పర్వేశ్ ఈ విషయంపైనే చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
-
ఇప్పటివరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
-
అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ
కేంద్ర మంత్రి అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ గెలుపొందిన తర్వాత.. అమిత్ షాతో ఆయన అయిన తొలి సమావేశం ఇదే.
-
కేజ్రీవాల్ ఓటమి
ఆప్ భవిష్యత్తుకి భారీ దెబ్బ తగిలింది. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ ఓడిపోయారు. న్యూఢిల్లీ స్థానంలో ఆప్ నేత కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ మధ్య విజయం ఇవాళ ఉదయం నుంచి దోబూచులాడుతోంది. చివరకు పర్వేజ్ గెలిచారు. మరోవైపు, ఆప్ కీలక నేత సిసోడియా కూడా ఓడిపోయారు.
-
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపు?
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 43 స్థానాల్లో ముందంజలో ఉండి, ఆరు స్థానాల్లో గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది, రెండు స్థానాల్లో గెలిచింది. మిగతా పార్టీలకు ఒక్క సీటూ దక్కలేదు.
-
బీజేపీ కార్యకర్త భావోద్వేగం
ఢిల్లీలో బీజేపీ ఎన్నో ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ కార్యకర్త పునీత్ వోహ్రా మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు పెట్టుకుంటుండగా పలువురు కార్యకర్తలు ఓదార్చారు.
#DelhiElections2025 | BJP worker Puneet Vohra gets emotional during celebrations as the official trends indicate BJP coming back to power in the National Capital pic.twitter.com/KzcxXaHQSY
— ANI (@ANI) February 8, 2025
-
ఓట్ షేర్ ఆ పార్టీకి ఎంత?
ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం బీజేపీకి 48 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం, కాంగ్రెస్‌కి 6.7 శాతం ఓట్ షేర్ వచ్చింది.
-
బోణీ కొట్టిన ఆప్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బోణీ కొట్టింది. ఈ కౌంటింగ్‌లో వెల్లడైన తొలి ఫలితం ఇదే. కోండ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ గెలిచారు.
-
వాళ్లు వద్దని ప్రజలు అనుకున్నారు: బండి సంజయ్
అవినీతి, జైలు పాలవుతున్న పార్టీల పెద్దలు తమకు వద్దని ఢిల్లీ ప్రజలు అనుకున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు... Read More
-
కేజ్రీవాల్ వేషధారణలో అలరించిన పిల్లాడు
ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆప్ మద్దతుదారుడైన ఓ చిన్నారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేషధారణలో కనపడి అలరించాడు. ఓ వైపు ఎన్నికల ఫలితాలు వస్తుండగా మరోవైపు అతడు ఆప్‌కి మద్దతు తెలుపుతూ కేజ్రీవాల్ నివాసం వద్దకు వెళ్లాడు. కేజ్రీవాల్ లాంటి స్వెటర్, కళ్లజోడు పెట్టుకుని అతడు కనపడిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చిన్నారి పేరు అవ్యాన్ తోమర్. ఢిల్లీలోని ఓ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు.
#WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En
— ANI (@ANI) February 8, 2025
-
కేజ్రీవాల్, పర్వేజ్ మధ్య దోబూచులాడుతోన్న విజయం
న్యూఢిల్లీ స్థానంలో ఆప్ నేత కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ మధ్య విజయం దోబూచులాడుతోంది. ఆరు రౌండ్ల తర్వాత కేజ్రీవాల్ మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు. పర్వేజ్ 225 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
పరస్పరం ఇంకా కొట్టుకోండి.. ఒమర్ అబ్దుల్లా ట్వీట్..
ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సెటైర్ తో కూడిన ట్వీట్ చేశారు. ‘ఇంకా కొట్టుకోండి. ఒకరినొకరు ఖతం చేసుకోండి’ అంటూ ఓ మీమ్ షేర్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కొట్టుకుని ఓట్లు చీల్చుకోవడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూర్చారనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
-
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీమ్స్..
బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో, ఆప్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలపై నెటిజన్స్ విభిన్నంగా మీమ్స్ చేస్తూ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు... Read More
-
బీజేపీ సంబరాలు
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
వాచ్ లైవ్ >>
-
ముందంజలో కేజ్రీవాల్
న్యూఢిల్లీ స్థానంలో మొదట వెనుకంజలో కొనసాగిన కేజ్రీవాల్ ప్రస్తుతం ముందంజలోకి వచ్చారు. ఇప్పుడు 343 ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగుతున్నారు.
-
కేజ్రీవాల్ అసత్యాలను ఎవరూ నమ్మలేదు: బీజేపీ
ఢిల్లీలో ఆప్ వెనుకంజలో ఉండడంతో ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ చెప్పిన అసత్యాలను ఎవరూ నమ్మలేదని అన్నారు. ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలు ఇలాగే ఓడిస్తారని చెప్పారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
-
బీజేపీ 48 సీట్లలో ఆధిక్యం
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీ 48 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆప్ 21, కాంగ్రెస్ ఒక స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి.
-
మెజారిటీ స్థానాల్లో లీడింగ్‌లో బీజేపీ
ఢిల్లీలో అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు సాధించాలి. ప్రస్తుతం బీజేపీ 38 సీట్లలో, ఆప్ 25, కాంగ్రెస్ ఒక సీటులో లీడింగ్‌లో ఉన్నాయి.
-
వెనుకంజలో కేజ్రీవాల్, అతిశీ, సిసోడియా
ఎన్నికల కౌంటింగ్ తొలిదశలో ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, అతిశీ, సిసోడియా వెనుకంజలో ఉన్నారు.
-
Delhi Election Result 2025 LIVE Updates: బద్లీ నియోజకవర్గంలో హస్తం ఆధిక్యం
బద్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేందర్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 70 సీట్లలో కాంగ్రెస్ ఈ ఒక్క సీటులోనే లీడింగ్ లో ఉంది. ఆప్ మీద హస్తం ఆదిక్యంలో ఉండడం విశేషం.
-
Delhi Election Result 2025 LIVE Updates: గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఆప్ మంత్రి ఆధిక్యం
గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఆప్ మంత్రి సౌరబ్ భరద్వాజ్ లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ కంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు
-
Delhi Election Result 2025 LIVE Updates: చాందినీ చౌక్ లో బీజేపీ అభ్యర్థి సతీష్ జైన్ లీడ్
చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి పునర్దీప్ సింగ్ పై బీజేపీ అభ్యర్థి సతీష్ జైన్ ఆధిక్యంలో ఉన్నారు
-
గత ఎన్నికల్లో ఆప్‌కు 62 సీట్లు
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 62, బీజేపీకి 8 సీట్లు దక్కాయి.
-
వీరి భవితవ్యం ఏంటి?
ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి. 70 అసెంబ్లీ సీట్లకు దాదాపు 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారి భవితవ్యం నేడు తేలుతోంది.