Bandi Sanjay: అందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడింది.. మేము గెలిచాం.. ఇక తెలంగాణలోనూ..: బండి సంజయ్
తమ పార్టీ భారీ విజయం అందుకునే దిశగా వెళుతోందని బండి సంజయ్ తెలిపారు.

Union Minister Bandi Sanjay
అవినీతి, జైలు పాలవుతున్న పార్టీల పెద్దలు తమకు వద్దని ఢిల్లీ ప్రజలు అనుకున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉండడంపై బండి సంజయ్ ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆప్‌ని ప్రజలు చీపురుతో ఊడ్చేశారని బండి సంజయ్ అన్నారు. తమ పార్టీ భారీ విజయం అందుకునే దిశగా వెళుతోందని తెలిపారు.
Delhi Assembly Election 2025: ఎన్నికల ఫలితాలపై మీమ్స్.. పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు
ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకుంటున్నట్లు బండి సంజయ్ చెప్పారు. ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని ముందుగానే భావించామని తెలిపారు. మేధావి వర్గ ఓట్లు అన్నీ బీజేపీకే పడ్డాయని చెప్పారు. ఇక తమ పార్టీ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని అన్నారు.
కొన్ని రోజుల్లో తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లు వేస్తున్న వారు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అసెంబ్లలో వారి సమస్యలపై బీజేపీ మాత్రమే ప్రశ్నిస్తుందని చెప్పారు.
కాగా, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ దూసుకెళుతోందంటూ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.