LIC Schemes : సామాన్యులకు దీపావళి కానుక.. ఎల్ఐసీలో 2 అద్భుతమైన బీమా పథకాలు.. బెనిఫిట్స్ ఇవే.. ఎప్పటినుంచంటే?
LIC Schemes : మధ్యతరగతి వారి కోసం ఎల్ఐసీ రెండు LIC పథకాలను ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఎల్ఐసీ షేర్లు భారీగా పెరిగాయి.

LIC Schemes
LIC Schemes : దీపావళికి ముందే సామాన్యులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) మధ్యతరగతి వారికి దీపావళి బహుమతిని అందిస్తోంది. తక్కువ ఆదాయం, మధ్యతరగతి వారికోసం ప్రత్యేకించి రెండు రిస్క్- ఫ్రీ స్కీమ్స్ ప్రవేశపెట్టింది.
ప్రీమియం తక్కువగా ఉండేలా (LIC Schemes) రెండు ఇన్సూరెస్స్ పథకాలను అందిస్తోంది. ఈ రెండు పథకాలు పూర్తిగా రిస్క్ లేనివి. అంతేకాదు.. స్టాక్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు.
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి :
ఎల్ఐసీ ప్రకారం.. ఈ రెండు పథకాల నుంచి ఎలాంటి బోనస్‌లను పొందలేరు. అక్టోబర్ 14న జరిగిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు పథకాలు అక్టోబర్ 15 నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ రెండు పథకాలు వేర్వేరు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఎల్ఐసీ అందించే రెండు పథకాలేంటి? ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎల్ఐసీ జన్ సురక్ష :
ఎల్ఐసీ జన్ సురక్ష పథకం అనేది తక్కువ ఆదాయ వర్గాల వారికోసం ప్రత్యేకంగా అందిస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకం. నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ బీమా పథకంగా చెప్పవచ్చు. అంటే.. మార్కెట్ లేదా బోనస్‌లతో సంబంధం ఉండదు. ఆర్థికంగా బలహీన వర్గాల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. ఇలాంటి ప్లాన్లు తక్కువ ప్రీమియంలకు అందుబాటులో ఉంటాయి.
ఎల్ఐసీ బీమా లక్ష్మి :
ఎల్ఐసీ బీమా లక్ష్మి అనేది కొత్త జీవిత బీమా సేవింగ్స్ స్కీమ్ నాన్-పార్, నాన్-లింక్డ్ స్కీమ్.. అంటే.. రాబడి మార్కెట్‌తో సంబంధం ఉండదు. బోనస్‌లు ఉండవు. ఈ పథకం జీవిత బీమా, మెచ్యూరిటీ లేదా సేవింగ్స్ రెండింటినీ అందిస్తుంది. వ్యక్తుల అవసరాలను తీర్చడమే ఈ పథకం లక్ష్యం.
కంపెనీ షేర్లలో పెరుగుదల :
ఎల్ఐసీలో ఈ రెండు కొత్త పథకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎల్ఐసీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో షేర్ రూ.897.25 ముగింపుతో పోలిస్తే.. ఎల్ఐసీ షేర్ ధర రూ. 904.15 గరిష్ట స్థాయికి, రూ. 893.45 కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ఎల్ఐసీ షేర్ ధర గత ఏడాదిగా నిరాశపరుస్తోంది. వరుసగా 6శాతం, 0.5శాతం మేర తగ్గింది. అయితే, ఎల్ఐసీ స్టాక్ 6 నెలల్లో 17శాతం పెరిగింది.