River Indie e-Scooter : కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. ఈ కూల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఊహించని డిస్కౌంట్.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్.. డోంట్ మిస్..!

River Indie e-Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ రివర్ మొబిలిటీ రివర్ ఇండి మోడల్‌పై రూ. 22,500 వరకు డిసెంబర్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు.

River Indie e-Scooter : కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. ఈ కూల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఊహించని డిస్కౌంట్.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్.. డోంట్ మిస్..!

River Indie e-Scooter

Updated On : December 19, 2025 / 7:12 PM IST

River Indie e-Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఇయర్ ఎండ్ ఆఫర్.. 2025 ఏడాది చివరిలో ఎలక్ట్రిక్ వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు భారీగా ఆఫర్లను గుప్పిస్తున్నాయి. ఈ నెలలో కార్లు, బైక్‌లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కొనుగోలు చేసేవారికి అద్భుతమైన టైమ్.. ఎందుకంటే ఏడాది చివరి నెలలో వాహన కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లు అందిస్తాయి.

ఈ రేంజ్‌లో డిసెంబర్‌లో ఇండీ ఎలక్ట్రిక్ (River Indie e-Scooter) స్కూటర్‌ను కొనుగోలుకు రివర్ మొబిలిటీ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ అద్భుతమైన స్కూటర్‌పై వినియోగదారులు డిసెంబర్ 31, 2025 వరకు రూ. 22,500 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో అప్లియన్సెస్‌పై ఈజీ ఫైనాన్స్, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.

ఈజీ ఫైనాన్స్ ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు :
ఈ డిసెంబర్ నెలలో రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ. 14,999 డౌన్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ డీల్ Evfin, IDFC కాంట్రిబ్యూషన్‌తో అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర కన్నా భారీ తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. కంపెనీ స్టోర్‌లలో రూ. 7,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

కొన్ని ప్రత్యేక బ్యాంక్ కార్డులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్టోర్‌లు పూణే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా ఇతర నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ HDFC, వన్ కార్డ్, కోటక్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కొన్ని స్పెషల్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈఎంఐ ఎంత చెల్లించాలంటే? :
ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించేందుకు రివర్ ఇండీపై ఈ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉన్నాయి. రివర్ కస్టమర్ల కోసం మరో ఆఫర్ ప్రవేశపెట్టింది. మీరు ఇప్పుడు రూ. 14వేల వరకు ఈఎంఐలతో అన్ని ఇండీ స్కూటర్ అప్లియన్సెస్ కొనుగోలు చేయవచ్చు. మీ స్కూటర్‌కు మీకు నచ్చిన విధంగా అప్లియన్సెస్ యాడ్ చేయొచ్చు. అంతేకాదు.. ఈజీ ఈఎంఐలలో కూడా చెల్లించవచ్చు.

రివర్ ఇండి ధర, ఫీచర్లు :
ఇప్పుడు, రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,42,999 నుంచి ప్రారంభమవుతుంది. అద్భుతమైన ఫీచర్లతో రివర్ ఇండిని స్కూటర్ల SUV అంటారు. 4Kwh బ్యాటరీతో అమర్చి ఉంటుంది.

సింగిల్ ఫుల్ ఛార్జ్‌తో 163 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. 6.7kW ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. రివర్ ఇండి ఫీచర్లు, రోడ్ ప్రెజెన్స్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి నెలా టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీల లిస్టులో నిలుస్తోంది.