LML Motorcycles: మళ్లీ భారత మార్కెట్లోకి రానున్న ఎల్ఎంఎల్ మోటార్ సైకిల్స్: మూడు విద్యుత్ వాహనాలు తెస్తున్నట్లు వెల్లడి

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం లోహియా మెషినరీ లిమిటెడ్(ఎల్ఎంఎల్) మోటార్ సైకిల్స్ సంస్థ తిరిగి మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది

LML Motorcycles: మళ్లీ భారత మార్కెట్లోకి రానున్న ఎల్ఎంఎల్ మోటార్ సైకిల్స్: మూడు విద్యుత్ వాహనాలు తెస్తున్నట్లు వెల్లడి

Lml

Updated On : April 19, 2022 / 1:08 PM IST

LML Motorcycles: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం లోహియా మెషినరీ లిమిటెడ్(ఎల్ఎంఎల్) మోటార్ సైకిల్స్ సంస్థ తిరిగి మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 1990 – 2000 మధ్య కాలంలో బజాజ్ చేతక్ స్కూటర్ కి ధీటుగా స్కూటర్లను తయారు చేసిన ఎల్ఎంఎల్ భారతీయులకు సుపరిచితమే. ఇటలీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాగ్జియోతో కలిస్ భారత్ లో స్కూటర్లు, మోటార్ సైకిల్స్ తయారు చేసి మార్కెట్ చేసింది ఎల్ఎంఎల్ సంస్థ. అయితే అనుకోని కారణాలతో 2017లో మోటార్ సైకిల్ విభాగానికి స్వస్తి పలికిన ఎల్ఎంఎల్ సంస్థ, భారీ పరిశ్రమలకు విద్యుత్ పరికరాల తయారీ, ఇతర రంగాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల దేశంలో విద్యుత్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన ఎల్ఎంఎల్ సంస్థ..ఆ విభాగంలో అడుగుపెట్టింది.

Also read:Russia – India: రష్యాకు ఎగుమతులు పునరుద్ధరించిన భారత్: ఇరు దేశాల కరెన్సీతోనే చెల్లింపులు

రానున్న ఏడాది కాలంలో తమ సంస్థ నుంచి మూడు విద్యుత్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్ కోసం ఇప్పటికే “Detel” అనే విద్యుత్ వాహన సంస్థతో LML జతకట్టింది. LML Electric పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఉమ్మడి సంస్థకు “SG Corporate Mobility” మాతృ సంస్థగా నిలవనుంది. 2024 నాటికి LML ఎలక్ట్రిక్ బ్రాండ్ పై మూడు మధ్యశ్రేణి, ఒక ప్రీమియం రేంజ్ విద్యుత్ వాహనాలను భారత్ లో విడుదల చేయనున్నట్లు ఎల్ఎంఎల్ సంస్థ వెల్లడించింది.

Also read:Twitter Edit Tweet : ట్విట్టర్‌లో ఎడిట్ బటన్.. మీ ట్వీట్ ఎన్నిసార్లు ఎడిట్ చేశారో తెలిసిపోతుంది.. జాగ్రత్త..!

మరోవైపు..భారత్ లో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన విభాగంపై కన్నేసిన ఎల్ఎంఎల్, ఆమేరకు జర్మనీ సంస్థ “eROCKIT”తో కలిసి మరో మూడు అత్యున్నత శ్రేణి విద్యుత్ వాహనాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 2022 నాటికీ ఎల్ఎంఎల్ సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ విద్యుత్ వాహనాల తయారీ నిమిత్తం, పరిశ్రమ ఏర్పాటుకు స్థల సేకరణ నిమిత్తం పలు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది.

Also read:Covid-19 Update : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1247 మాత్రమే..!