3 గంటల్లో కారు సర్వీసింగ్..ఆ నగరంలో మాత్రమే

  • Published By: madhu ,Published On : December 26, 2019 / 11:51 AM IST
3 గంటల్లో కారు సర్వీసింగ్..ఆ నగరంలో మాత్రమే

Updated On : December 26, 2019 / 11:51 AM IST

కారు సర్వీసింగ్ ఇవ్వాలంటే..కనీసం మూడు రోజుల ముందు ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే..సర్వీసింగ్ సెంటర్ లో ఒక కారు సర్వీసింగ్ చేయించాలంటే..రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటుంటారు. దీంతో కారు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఆ భాధలన్నింటికీ చెక్ పెట్టండి అంటోంది ప్రముఖ కార్ల కంపెనీల్లో ఒకటైన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ..మెర్సిడెస్ బెంజ్.

 

వినియోగదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం మూడు గంటల్లో కారు సర్వీసింగ్ చేసి ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ప్రీమియర్ ఎక్స్ ప్రెస్ ప్రైమ్ సర్వీస్ పేరిట సర్వీసింగ్ సేవలను అందిస్తామని వెల్లడించింది. కేవలం మూడు గంటల్లో పూర్తిస్థాయి సర్వీసింగ్ ను అందిస్తామని హామీనిస్తోంది. కానీ ఈ ఆఫర్ ప్రస్తుతానికి భారతదేశంలోని బెంగుళూరు నగరంలో మాత్రమే వర్తిస్తుందని, త్వరలోనే ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ లో సేవలను తీసుకరానున్నట్లు తెలిపింది.

ఈ సదుపాయం వల్ల వినియోగదారుల సమయం వేస్ట్ కాకుండా ఉంటుందని వెల్లడించింది. ఇందులో రెండు రకాల సర్వీసులను పొందుపరిచింది. సేవా కేంద్రాల్లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది సంస్థ. టీం లీడర్ తో పాటు..ఇద్దరు సర్టిఫైడ్ మెంటెనెన్స్ టెక్నీషియన్స్ ఉంటారు. 

 

Service B Type :-
 

* ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ చెకప్, రీ ప్లేస్ మెంట్.
* బ్రేక్ ఫ్లూయిడ్ రీ ప్లేస్ మెంట్. 
* డస్ట్ ఫిల్టర్ రీ ప్లేస్ మెంట్. 
* వీల్ రోటేషన్.
* కూలెంట్ యాంటీఫ్రిజ్ మిక్సర్ రేషియో చెకింగ్.
* ఇంటీరియర్ అండ్ ఎక్స్ టీరియర్ క్లీనింగ్.

Service B Type : –
 

* ఫ్యూయల్ ఫిల్టర్ చెక్, ఎయిర్ ఫిల్టర్ రీ ప్లేస్ మెంట్.
* డీజిల్ ఫ్యూయల్ ఫిల్టర్. బ్రేక్ ప్యాడ్.
* వీల్ బాలెన్సింగ్.
* మరమ్మత్తులు, గ్యారెంటీ మరమ్మత్తులలపై సేవలను ఇందులో నుంచి మినహాయించింది. 
 

Read More : సూర్య గ్రహణం : తెరుచుకున్న టెంపుల్స్..సంప్రోక్షణలు