MG Hector Tomahawk PHEV : ఫుల్ బ్యాటరీ.. ఫుల్ ట్యాంక్.. 1,100+ కి.మీ. రేంజ్! ఎంజీ హెక్టర్ టోమాహాక్ భారత్‌లోకి ఎంట్రీ
MG Hector Tomahawk PHEV : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ భారత మార్కెట్లో కొత్త SUV హెక్టర్ టోమాహాక్ రిలీజ్ చేసింది. ఈ కొత్త హెక్టర్ టోమాహాక్ ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్ట్రెయిన్లతో వస్తుంది. పూర్తి వివరాలివే..
MG Hector Tomahawk PHEV
- కొత్త ఎలక్ట్రిక్ SUV మోడల్ కొంటున్నారా?
- ఈ హెక్టర్ టోమాహాక్ ఈవీ 69.2kWh బ్యాటరీతో రన్
- సింగిల్ ఛార్జ్‌పై 517 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది
- కేవలం ఎలక్ట్రిక్ ఛార్జింగ్‌తోనే 115కి.మీ పైగా రేంజ్
MG Hector Tomahawk PHEV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త ఎస్యూవీ హెక్టర్ టోమాహాక్ పేరుతో లాంచ్ అయింది. హెక్టర్ టోమాహాక్ ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్ట్రెయిన్లతో లభిస్తుంది.
ఈ కొత్త ఎస్యూవీ అనేక స్పెషల్ ఫీచర్లను అందిస్తుంది. మీరు ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV మోడల్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది (MG Hector Tomahawk PHEV) మీకోసమే.. హెక్టర్ టోమాహాక్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎంజీ హెక్టర్ టోమాహాక్ ధర ఎంతంటే? :
కొత్త ఎంజీ హెక్టర్ టోమాహాక్ ధర విషయానికి వస్తే.. ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ కారు ధర రూ. 19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ SUV ఏడు-సీట్ల ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 5-సీట్ల ఎసెన్స్ వేరియంట్ ధర రూ. 23 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఏడు-సీట్ల ఎసెన్స్ వేరియంట్ ధర రూ. 23.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
PHEV మోడల్ 2 ఏడు-సీటర్ వేరియంట్లలో అందిస్తుంది. ఎక్స్‌క్లూజివ్ ధర రూ. 25.70 లక్షలు, ఎసెన్స్ ధర రూ. 27.80 లక్షలు. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఆసక్తిగల కస్టమర్లు ఈ EV SUVని BaaS ఆప్షన్‌తో కూడా కొనేసుకోవచ్చు. తద్వారా ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
బ్యాటరీ రెంట్ ఛార్జీలు కిలోమీటరుకు రూ. 4.90కు అందిస్తుంది. కస్టమర్లు ఈ EV SUVని BaaS ఆప్షన్‌తో కూడా కొనేసుకోవచ్చు. కాకపోతే ధర రూ. 13.99 లక్షల నుంచి ఉంటుంది. బ్యాటరీ రెంట్ ఛార్జీలు కిలోమీటరుకు రూ. 4.90 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంజీ హెక్టర్ టోమాహాక్ రేంజ్ :
ఈ హెక్టర్ టోమాహాక్ ఈవీ 69.2kWh బ్యాటరీతో రన్ అవుతుంది. పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో వస్తుంది. 150kW పవర్, 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 517 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 90kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
హెక్టర్ టోమాహాక్ PHEVలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 20.5kWh బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 148kW పవర్ జనరేట్ చేస్తుంది. ఈ SUV కేవలం ఎలక్ట్రిక్ ఛార్జింగ్‌తోనే 115 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్లగలదు.
ఫుల్ బ్యాటరీ, ఫుల్ పెట్రోల్ ట్యాంక్‌తో మొత్తం డ్రైవింగ్ రేంజ్ 1,100 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ కారు గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకునేందుకు సుమారు 9 సెకన్లు సమయం పడుతుంది.
Read Also : Redmi 17C 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17C 5G ఫోన్‌పై ఓ లుక్కేయాల్సిందే.. ఫీచర్లు మామూలుగా లేవు!
కొత్త ఎంపీ హెక్టర్ టోమాహాక్ 4 డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది. ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో కారు కేవలం బ్యాటరీ పవర్‌తో మాత్రమే రన్ అవుతుంది. సిరీస్ హైబ్రిడ్ మోడ్‌లో పెట్రోల్ ఇంజన్ పవర్ జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ వీల్స్ పవర్ అందిస్తుంది. ప్యారలల్ హైబ్రిడ్‌లో ఇంజిన్ మోటార్ రెండూ కలిసి వర్క్ అవుతాయి. ఇంజిన్ డైరెక్ట్ డ్రైవ్ మోడ్ ముఖ్యంగా హైవేలో వెళ్లేవారికి బెస్ట్ ఆప్షన్.
ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఫీచర్లు :
కొత్త ఎంజీ హెక్టర్ టోమాహాక్ క్యాబిన్ ఆల్మండ్ బ్రౌన్ కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో లెదర్ లాంటి సీట్ అప్హోల్స్టరీ, డాష్‌బోర్డ్ డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై లెదర్ లాంటి ఫినిషింగ్, లెదర్‌తో రోలింగ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్లు వెంటిలేటెడ్‌గా ఉంటాయి.
డ్రైవర్ సీటులో 6 వే ఎలక్ట్రిక్ అడ్జెస్టబుల్ మెమరీ ఫంక్షన్ ఉన్నాయి. కో-డ్రైవర్ సీటు కూడా ఫోర్ వే ఎలక్ట్రిక్ అడ్జెస్ట్ అందిస్తుంది. ఫీచర్లలో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ విండో సన్‌షేడ్, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 256-కలర్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.
ఈ SUVలో 8.8-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 15.6-అంగుళాల HD ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్టు ఇస్తుంది. మ్యూజిక్ కోసం 10-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ ఉంది. MG i-SMART 3.0 సిస్టమ్ 80కి పైగా కనెక్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. గెచర్ కంట్రోలింగ్ కోసం i-SWIPEను కూడా ఉంటుంది. GenAI-ఆధారిత వాయిస్ అసిస్టెంట్ 30కి పైగా కమాండ్స్ అర్థం చేసుకోగలదు.
